గరుడ శివాజీ పురాణం కంచికేనా

 


హైద్రాబాద్, జూన్ 8 (globelmedianews.com)
టివి 9 వివాదంలో చిక్కుకున్న గరుడ పురాణం శివాజీ దేశం దాటేసారా ? లేక వేషాలు మార్చి పోలీసుల కళ్ళముందే తిరుగుతున్నారా ? తాజాగా శివాజీ కోసం జల్లెడ పట్టి గాలిస్తున్న టి పోలీసులకు అనుమానాలు తలెత్తుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో తనకు వ్యతిరేక ప్రభుత్వాలే ఉండటంతో ఫోర్జరీ కేసులో అడ్డంగా బుక్ అయిన శివాజీ కి ఇప్పుడు షెల్టర్ ఇచ్చేవారు సైతం కరువయ్యారు. తెలంగాణ పోలీసులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శివాజీ కదలికలు కనిపెడుతూ ఉండటంతో మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ లకు వాడకానికి దూరంగా శివాజీ ఉన్నట్లు చెబుతున్నారు.


గరుడ శివాజీ పురాణం కంచికేనా
తనపై కేసులు నమోదు అయ్యాక తప్పించుకునేందుకే గరుడ శివాజీ గుండు గీయించుకున్నట్లు తెలుస్తుంది. రకరకాల విగ్గులతో వేషాలు మారుస్తూ ఉండేందుకే బోడిగుండు అంత ఉత్తమం లేదన్న అంచనాతో శివాజీ ఈ పని చేసినట్లు గా పోలీసులు సైతం అనుమానిస్తున్నారు. ఈ మారువేషం లోనే శ్రీలంక సముద్ర మార్గాన చెక్కేసినట్లు కొందరు అంచనా వేస్తున్నారు.ప్రస్తుతం దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో లుక్ అవుట్ నోటీసులు జారీ అయినందున శ్రీలంక నుంచి అమెరికా ఇతర దేశాలకు ఉడాయించి ఉండొచ్చని నిఘా విభాగం భావిస్తుంది. ఇప్పటికే ఫోర్జరీ కేసులో రవి ప్రకాష్ పోలీసుల ముందు మూడు సార్లు హాజరయ్యారు. ఇక ఈ కేసులో మరో నిందితుడు మూర్తి సైతం పోలీసుల ముందుకు వస్తున్నారు. ఈ కేసులో రవి ప్రకాష్ కు అరెస్ట్ తప్పకపోతే ఇక పోలీసులముందు హాజరు కాకుండా తప్పించుకోవాలని శివాజీ స్కెచ్ గా అనుమానిస్తున్నారు ఖాకీలు.

No comments:
Write comments