విజృంబిస్తున్న విష జ్వరాలు

 


విశాఖపట్నం, జూన్ 26, (globelmedianews.com
విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన పాడేరు, చింతపల్లి ,మొండి గడ్డ, బలపం, జీకే వీధి ,కేడీపేట పరిసర ప్రాంత గ్రామాలలో విష జ్వరాలు విజృంభించాయి. ప్రతి ఇంట్లో నూ ఒకరు లేక ఇద్దరు చొప్పున జ్వరం బారిన పడి అనారోగ్యంతో బాధపడుతున్నారు. స్థానిక వైద్యులు మందులు ఇచ్చినప్పటికీ ఆరోగ్యం కుదుట పడటం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఈ సీజన్లో ఏజెన్సీలో జ్వరాలు రావడం సర్వసాధారణంగా మారింది కానీ ఈ సంవత్సరం జ్వర బాధితుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 

విజృంబిస్తున్న విష జ్వరాలు

ప్రత్యేక వైద్య బృందాలతో వైద్యం అందించాలని గిరిజనులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.విశాఖ ఏజెన్సీలోని 11 మండలాల్లో అనేక గ్రామాలలోని ప్రజలు విష జ్వరాల బారిన పడి నరకయాతన అనుభవిస్తున్నారు. తమ దయనీయస్థితిని ప్రభుత్వం ప్రత్యేక వైద్య బృందాలను మన్య ప్రాంతాలకు పంపి విష జ్వరాలతో బాధపడుతున్న గిరిజనులకు చికిత్స అందించాలని వైద్యాధికారులను కోరుతున్నారు. ప్రతి సంవత్సరం వర్షాలు పడే సమయంలో నీరు కలుషితమవుతుంది. శుద్ధిచేసిన మీరు అందుబాటులో లేని కారణంగా కలుషిత నీరు త్రాగి  గిరిజనులు అనారోగ్య బారిన పడి మంచాల కే పరిమితం అవుతున్నారు.ఆనారోగ్యంతో బాదపడే వారిలో పిల్లలు ఎక్కువగా ఉన్నారు. వైద్యం చేయించుకోవాలంటే రహదారి సదుపాయం లేక అనేక కిలోమీటర్లు నడిచి వెళ్ళ వలసిన దుస్థితి.దీని కారణంగా గిరిజనులు ఇళ్లకే పరిమితమై నాటు మందులు వాడి రోగాలను ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు.

No comments:
Write comments