అభిమాని కూతురుకు పవన్ పేరు

 


గుంటూరు, జూన్ 25, (globelmedianews.com)
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తన అభిమాని కూతురికి నామరణం చేశారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన ఎర్రం అంకమ్మరావు పవన్ వీరాభిమాని. ఇటీవలే ఆయన భార్య ఇందిర పండంటి పాపకు జన్మనిచ్చింది. తన అభిమాన నటుడితో పాపకు నామకరణం చేయాలని భావించిన అంకమ్మరావు సతీసమేతంగా పాపను తీసుకొని జనసేనానిని కలిశారు. అభిమాని కోరిక మేరకు.. పవన్ కళ్యాణ్ ఆ పాపకు వేద వినీషా అని పేరు పెట్టారు. అనంతరం ఆ పాపను చేతుల్లోకి తీసుకొని ఆడించారు. దీంతో ఆ దంపతులు హ్యాపీగా ఫీలయ్యారు. అభిమాని కూతురుకు పవన్ పేరు
గత ఏప్రిల్‌లో మెగాస్టార్ చిరంజీవి కూడా తన అభిమాని కుమారుడికి నామకరణం చేసిన సంగతి తెలిసిందే. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలం మందపల్లికి చెందిన నక్కా వెంకటేశ్వర రావు కుమారుడికి 2018 ఏప్రిల్‌లో బాబు జన్మించాడు. తన కొడుక్కి చిరంజీవి మాత్రమే పేరు పెట్టాలని అతడు భిష్మించుకున్నాడు. ఆ విషయం తెలుసుకున్న చిరంజీవి.. తన తమ్ముడి పేరులోని పవన్, తన అసలు పేరు శివ శంకర ప్రసాద్‌లోని శంకర్ కలిసొచ్చేలా ఆ చిన్నారికి పవన్ శంకర్ అని పేరు పెట్టారు. 

No comments:
Write comments