కోడెలపై మండిపడ్డ ప్రభుత్వ విప్ గడికోట

 


అమరావత్ర్హి జూన్ 12 (globelmedianews.com);
తెలుగుదేశం ప్రభుత్వం గతంలో తమ గొంతు నొక్కేసిందని ఏపీ ప్రభుత్వ విప్, వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్వించారు. అసెంబ్లీకి వచ్చిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తూ అడ్డగోలుగా కొనుగోలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం జగన్ పాలన ఏరకంగా ఉందో, ఏపీ అసెంబ్లీని కూడా అదే స్ఫూర్తితో నిర్వహిస్తామని చెప్పారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు.


కోడెలపై మండిపడ్డ ప్రభుత్వ విప్ గడికోట 
ఈ సందర్భంగా ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఏపీ స్పీకర్ గా పనిచేసిన కోడెల శివప్రసాదరావు అధికార పక్షం చెప్పినట్లు ఆడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన స్పీకర్ పదవికే మచ్చ తీసుకొచ్చారని దుయ్యబట్టారు. ఈసారి అసెంబ్లీ సమావేశాలు ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారాలు, స్పీకర్ ఎన్నిక, గవర్నర్ ప్రసంగానికే పరిమితం అవుతుందని స్పష్టం చేశారు. త్వరలో మళ్లీ జరిగే సమావేశాల్లో పారదర్శకతే అజెండాగా ఉంటుందని చెప్పారు.

No comments:
Write comments