నీతి అయోగ్ కు నివేదిక చేసిన అధికారులు

 


విజయవాడ, జూన్ 14,  (globelmedianews.com)
ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ హోం మంత్రి అమిత్‌ షాతో బేటీ అయ్యారు. ఏపీ అభివృద్ధి పనుల కోసం జగన్ ఢిల్లీలోనే మూడు రోజులపాటు ఉండనున్నారు. శనివారం ప్రధాని నాయకత్వంలో జరిగే నీతి ఆయోగ్‌ సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఏపీ ప్రత్యేక హోదా అంశం నీతి ఆయోగ్‌తో ముడిపడి ఉందనే సంగతి తెలిసిందే. గతంలో ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వొద్దని నీతి ఆయోగ్ చెప్పినందుకే తాము ఇవ్వలేకపోతున్నామని కేంద్రం తెలిపింది. దీంతో ఏపీకి ప్రత్యేక హోదా ఆవశ్యకతను నీతి ఆయోగ్‌కు వివరించడానికి సీఎం జగన్ ఇప్పటికే ఓ నివేదికను సిద్ధం చేయించారు. భేటీ సందర్భంగా ఆ రిపోర్టును నీతి ఆయోగ్ ముందు దాన్ని ఉంచనున్నారు.


 నీతి అయోగ్ కు నివేదిక చేసిన అధికారులు
శనివారం నిర్వహించే వైఎస్సార్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశంలోనూ జగన్ పాల్గొంటారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎంపీలతో ఆయన చర్చిస్తారు. వైఎస్ఆర్సీపీకి చెందిన 22 మంది లోక్‌సభ సభ్యులు, ఇద్దరు రాజ్యసభ సభ్యులు ఈ భేటీలో పాల్గొంటారు. జూన్ 17 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టక ముందు.. తన ప్రమాణ స్వీకార వేడుకకు హాజరు కావాల్సిందిగా కోరడం కోసం జగన్ గతంలో ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా, అదే రోజు తన ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా ఉండటంతో ప్రధాని అమరావతి రాలేకపోయారు. ఏపీ సీఎంగా మే 30న మధ్యాహ్నం బాధ్యతలు చేపట్టిన జగన్.. అనంతరం మోదీ ప్రమాణ స్వీకార వేడుకలో పాల్గొనడం కోసం కేసీఆర్‌తో కలిసి ఢిల్లీ వెళ్లాలని భావించారు. కానీ ఆరోజు మధ్యాహ్నం 3.30 తర్వాత విమానం ల్యాండ్ కావడానికి అనుమతి లేకపోవడంతో వెళ్లలేకపోయారు. 

No comments:
Write comments