రేవంత్ కు పట్టని కాంగ్రెస్ సంక్షోభం

 


హైద్రాబాద్, జూన్ 11, (gobelmedianews.com)
కాంగ్రెస్ పార్టీ సంక్షోభంలో ఉంది. అటు కేంద్రంలోనూ, ఇటు తెలంగాణలోనూ ఆ పార్టీ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఇప్పటికే కేంద్రంలో కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటానని ప్రకటించిన రాహుల్ గాంధీ... ఎట్టి పరిస్థితుల్లోనూ మనసు మార్చుకునేది లేదని స్పష్టం చేశారు. జాతీయస్థాయిలో కాంగ్రెస్ సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో తెలంగాణలో ఆ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చింది అధికార టీఆర్ఎస్. కాంగ్రెస్ పార్టీలోని మెజార్టీ సభ్యులు టీఆర్ఎస్‌లో చేరడంతో... కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేసుకుంది. దీనిపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. 


రేవంత్ కు పట్టని కాంగ్రెస్  సంక్షోభం
దీనిపై కోర్టును ఆశ్రయించడంతో పాటు క్షేత్రస్థాయిలో ఆందోళనలు చేపట్టారు. అయితే కాంగ్రెస్ చేపట్టిన ఈ దీక్షకు కాంగ్రెస్ తరపున ఎంపీలుగా గెలిచిన రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఇద్దరు నేతలు ఆందోళనలో పాల్గొనకపోవడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ తప్పుబట్టారు. అయితే టీఆర్ఎస్ఎల్పీలో కాంగ్రెస్ఎల్పీ విలీనం అంశంపై రేవంత్ రెడ్డి పెద్దగా స్పందించలేదని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. తన నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి ఇటీవల రైల్వే జీఎంను కలిసిన రేవంత్ రెడ్డి... ఎందుకనో రాష్ట్రంలోని పార్టీ వ్యవహారాలపై రియాక్ట్ కావడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. సాధారణంగా కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడంలో ముందుండే రేవంత్ రెడ్డి... కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇంత కీలకమైన సమస్యపై స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది.

No comments:
Write comments