హైద్రాబాద్ లో హర్రార్

 

హైద్రాబాద్, జూన్ 8 (globelmedianews.com)

హైదరాబాద్‌లో మళ్లీ పట్టపగలు దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడిని కొందరు వెంటాడి మరీ కత్తితో నరికారు. బాధితుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చావుబతుకులతో పోరాడుతున్నాడు. ఎస్.ఆర్.నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బస్‌స్టాప్ వద్ద చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ప్రజలను భయబ్రాంతులకు గురిచేసింది. సంగారెడ్డికి చెందిన ఇంతియాజ్‌ అనే యువకుడు ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని, దీంతో అమ్మాయి తరఫు బంధువులు అతడిపై దాడి చేశారని తెలిసింది. 


హైద్రాబాద్ లో హర్రార్
ఈ విషయంపై పోలీసు స్టేషన్‌లో ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిరింది. అనంతరం ఇంతియాజ్, అతడి కుటుంబ సభ్యులు వాహనంలో తిరిగి ఇంటికి బయల్దేరారు. అయితే, ఎస్.ఆర్.నగర్ మెట్రో స్టేషన్ దాటిన తర్వాత బస్‌స్టాండ్ వద్దకు చేరుకోగానే అమ్మాయి తరఫు బంధువులు ఇంతియాజ్ కారుకు అడ్డంగా ఆటోను నిలిపారు. అనంతరం వాహనంలో ఉన్న ఇంతియాజ్‌పై కత్తితో దాడి చేశారు. ప్రాణాలు కాపాడుకోడానికి ఇంతియాజ్ వాహనం నుంచి బయటకు వచ్చి రోడ్డుపై పరిగెట్టాడు. అతడిని వెంటాడిన ఇంకో యువకుడు కత్తితో దారుణంగా నరికాడు. ఇంతియాజ్ కిందపడినా.. వదలకుండా తలపై కత్తితో దాడి చేశాడు. చుట్టుపక్కలవారు అతన్ని అడ్డుకోడానికి ప్రయత్నించినా ఆగలేదు. తీవ్ర గాయాలతో ఉన్న ఇంతియాజ్‌ను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం ఇంకా అందాల్సి ఉంది. గతంలో ఎర్రగడ్డ, అత్తాపూర్‌లో కూడా ఇలాంటి ఘటనలే చోటుచేసుకున్నాయి. 

No comments:
Write comments