విశ్వ నగరం కాదు కాంక్రీట్ జంగిల్ :మండిపడ్డ కోదండ రెడ్డి

 


హైదరాబాద్ జూన్ 24 (globelmedianews.com
హైదరాబాద్ విశ్వ నగరం కాదు కాంక్రీట్ జంగిల్ లాగా మార్చారని  ఆల్ ఇండియా కాంగ్రెస్ కిసాన్ సెల్ ఉపాద్యక్షలు కోదండ రెడ్డి మంది పడ్డారు.కొద్దీ వర్షానికే జనాలు 3 గంటలు ట్రాఫిక్ తో ఇబ్బంది పడ్డారని, మాన్ సూన్ యాక్షన్ రూపొందించడంలో విఫలమయ్యారని విమర్శించారు.సోమవారం  మీడియా సమావేశం లో మాట్లాడుతూ హైదరాబాద్ లో కాలుష్యం పెరిగి పోయిందన్నారు. రియలేస్టేట్ కు ఉతం ఇచ్చేలా మార్చారని దుయ్యబట్టారు. మై హోమ్ ప్రభుత్వం కు పాలిచ్చే బర్రె.పర్మిషన్ లేకపోయినా  మై హోమ్ వాళ్ళు బిల్డింగ్ లు కడుతున్నారు. 


విశ్వ నగరం కాదు కాంక్రీట్ జంగిల్ :మండిపడ్డ కోదండ రెడ్డి 

2సెంటిమీటర్ ల వర్షం పడితే సమస్య పరిష్కారం చేయకుండా  అధికారులు వర్షం పడితే ఇంట్లో నుండి బయటకి వెళ్లకూడదని ఉచిత సలహ ఇస్తున్నారని విమర్శించారు.మూసి ప్రక్షాళన ఏది.ఇప్పటి వరకు మూసి ప్రక్షళన చేయలేదు.మూసి నది భూమి అంత కబ్జా కు గురి అవుతుంది. హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ లో రెసిడెన్షియల్ జోన్ కనిపించడం లేదు.మొత్తం పబ్ లు రెస్టారెంట్ లు వెలుస్తున్నాయన్నారు ప్రభుత్వం రియలేస్టేట్ వారితో కుమ్మక్కు అయ్యిందన్నారు. లుంబిని పార్క్, నెక్లెస్ రోడ్ కట్టింది కాంగ్రెస్ అన్న విషయాన్ని ఈ సందర్బంగా కోదండ రెడ్డి గుర్తు చేసారు. మీరు వచ్చి యేదేండ్లు అయిన ఒక్క పని కూడా చేయలేదు.మీరు హైదరాబాద్ కు చేసిన పనులపై శ్వే త పత్రం రిలీజ్ చేయాలని డిమాండ్ చేసారు. రాజగోపాల్ రెడ్డి కి ఇచ్చిన నోటీస్ పై ఏఐసీసీ ఆదేశాల కోసం వేచి చేస్తున్నామని,నోటీస్ లు ఇచ్చిన తరువాత కూడా అభ్యంత కరంగా మాట్లాడారన్నారు.

No comments:
Write comments