విహెచ్ ఆరెస్టు

 


హైదరాబాద్ జూన్ 18  (globelmedianews.com): 
మాజీ ఎంపీ లు వి.హనుమంతారావ్, హర్ష కుమార్ లను పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేసారు. మంగళవారం ఉదయం 5 గంటలకు పంజాగుట్ట వద్ద అంబెత్కర్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు వి.హెచ్, హర్షకుమార్ ప్రయత్నించారు. లారీ లో అంబేత్కర్ విగ్రహాన్ని తీసుకు రాగా లారీ తో సహా విగ్రహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 


విహెచ్ ఆరెస్టు
విహెచ్, హర్షకుమార్ లతో పాటు కార్యకర్తలను అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు.  పోలీసుల చర్యను ఖండించిన విహెచ్  అర్టికల్ 3 ప్రకారమే తెలంగాణ వచ్చింది. అలాంటి అంబేద్కర్ ను ప్రభుత్వం అవమాన పరుస్తుందని విమర్శించారు. 13వ తేదీన అంబేద్కర్ విగ్రహాన్ని చేసిన తర్వాత మళ్లీ విగ్రహాన్ని ప్రతిష్టించే లేదు.  ఐదు లక్షలు పెట్టి నేను అంబేద్కర్ విగ్రహం చేయించాను. అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించాలని సంకల్పం ఇక్కడికి వచ్చిన వెంటనే పోలీసులు తరలించడం అన్యాయమని అన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడికి రెండు గంటల్లో తీసుకురాకపోతే పక్కనున్న వైఎస్ విగ్రహాన్ని కూడా కూల్చేస్తామని హెచ్చరించారు.

No comments:
Write comments