మరింత పెరగనున్న యూరియా ధరలు

 


ముంబై, జూన్ 6 (globelmedianews.com)
ఎరువుల ధరలు పది శాతం పెరగనున్నాయి. కీలకమైన పొటాషియం రేట్లలో ఎదుగుదలతో ఈ పరిస్థితి ఏర్పడుతోంది. వర్షాకాలం రానున్న తరుణంలో ఖరీఫ్ నాట్ల దశలోనే ఎరువుల ధరలు ఎగబాకడం రైతాంగానికి పిడుగుపాటుగా మారనుంది. శీతాకాలంలో ఎరువులకు పెట్టిన ఖర్చుతో పోలిస్తే ఇప్పుడు అమాంతం పది శాతం పెరుగుదల భారాన్ని రైతులు భరించాల్సి ఉంటుంది. ఎరువుల ఉత్పత్తిలో పొటాషియం ప్రధాన ముడిసరుకుగా ఉంది, ఈ పరిణామం, రూపాయి పతనంతో ఎరువుల ధరలపై ప్రభావం పడనుందని మార్కెట్ వర్గాలు  తెలిపాయి. అయితే ప్రభుత్వ అధీనంలో విక్రమాలు జరిగే ఎరువుల ధరలు స్థిరంగానే ఉంటాయి.వీటిలో పెరుగుదల ఉండదని వెల్లడైంది. దేశంలో వ్యవసాయ అవసరాల కోసం ప్రతి ఏటా 32 మిలియన్ టన్నుల యురియా అవసరం ఉంటుంది. ఇందులో పాతిక వంతు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటారు. అయితే అవసరం అయిన పొటాష్ అంతా విదేశాల నుంచి రావాల్సిందే. జూన్ తొలివారంలో రుతుపవనాలు వస్తాయనే ఆశతో దేశవ్యాప్తంగా రైతాంగం ఇప్పటికే వరి, సోయాబిన్, పత్తి, చెరకు ఇతర పంటల నాట్లకు రంగం సిద్ధం చేసుకొంటోంది. 


మరింత పెరగనున్న యూరియా ధరలు
డై అమ్మోనియం ఫాస్పేట్ (డిఎపి) ధరలు ఇప్పుడు 8 నుంచి 10 శాతం మేర పెరగుతాయి. 2018 రబీ పంట కాలంతో పోలిస్తే ఇప్పుడు 50 కీలోల సంచి ధర రూ 1,425 నుంచి రూ 1,450 స్థాయి వరకూ చేరుతాయి. ఇక మురియేట్ పొటాష్ (ఎంఒపి) ధరలు బ్యాగ్‌కు 8 శాతం చొప్పున పెరుగుతాయి.రైతులు వీటిని బ్యాగ్‌కు రూ 800 చెల్లించి కొనుక్కోవల్సిందే. ఇక నత్రజని, భాస్వరం, ఎన్‌పికె గ్రేడ్‌ల ధరలు కూడా కనీసం 8 శాతం పెరిగి, బ్యాగ్‌ల ( 50 కేజీలు) రూ 850 నుంచి రూ 1250 స్థాయికి చేరుతాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డిమాండ్‌తో పొటాష్ ధరలు ఇక్కడ కూడా చుక్కల్లోకి వెళ్లనున్నాయి. ఏడాది కాలంగా పొటాష్ ధరలు పెరుగుతూ పోతున్నాయి. ఇంతకు ముందు టన్నుకు రూ 12,000 ఉండగా ఇప్పుడు రూ 19000కు చేరాయి. ఈ పరిణామంతో ఎరువుల ఉత్పత్తి ఖర్చు పెరిగి, ధరలు పెరుగుతున్నాయని సంబంధిత పరిశ్రమ నిపుణుడు కపిల్ మెహన్ తెలిపారు. ఈ సీజన్‌లో ఎరువులు చాలినంతగా అందుబాటులో ఉన్నాయి. రష్యా, బెలారస్, కెనడా, జర్మనీ, ఇజ్రాయెల్, జోర్డాన్‌ల నుంచి దిగుమతులు చేసుకుంటున్నామని, ఇక్కడ ఎరువుల కొరత లేకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నామని, మొత్తం అవసరాలలో ఆయా దేశాల నుంచే 90 శాతం ఫాస్పేట్‌ను చేసుకున్నట్లు వ్యవసాయ మంత్రిత్వశాఖ గణాంకాలతో వెల్లడైంది. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి మారక విలువ పడిపోవడం కూడా ధరల జోరుకు కారణం అయింది. రాబోయే రోజులలో ఫాస్పేట్ ధరలు కూడా పెరిగి డిఎపి రేట్లు ఇనుమడిస్తాయని ఐసిఆర్‌ఎలని కార్పొరేట్ రేటింగ్స్ బృందం ప్రముఖుడు కె రవిచంద్రన్ తెలిపారు. దేశంలో అన్నింటి కన్నా యురియాను రైతాంగం ఎక్కువగా వాడుతారు.నాట్ల దశలో తరువాతి క్రమంలో దీని వాడకం ఎక్కువగా ఉంటుందని ఫర్టిలైజర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎస్ నంద్ తెలిపారు. ప్రస్తుతం 45 కిలోల యూరియా బ్యాగ్ రూ 267కు దొరుకుతోంది. ఇప్పటి అంచనాల మేరకు 16.4 ఎంటిల యురియా, 4.12 ఎంటిల డిఎపి, 2.04 ఎంటిల ఎంఒపి, 5.3 ఎంటిల ఎన్‌పికె, 2.5 ఎంటిల సింగిల్ సూపర్ ఫాస్పేట్ అవసరం ఉంటుంది. ఈసారి రుతుపవనాలు బలహీనంగానే ఉంటాయని, ఖరీఫ్ సాగు తగ్గుతుందని, దీనితో ఎరువుల వాడకంలో ఎదుగుదల కేవలం రెండు నుంచి మూడు శాతం వరకే ఉంటుంది

No comments:
Write comments