ఆ స్కూలు కష్టాలు ఇంతింత కాదు

 


ఖమ్మం, జూన్ 18, (globelmedianews.com)
ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచ గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అనేక సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి.  బడిలో కనీసం  తాగటానికి నీరు ,మౌలిక వసతులకు సంబంధించి టాయిలెట్స్ లేని పరిస్థితి దాపురించింది. మౌలిక వసతులు లేక విద్యార్థినులు , విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.  ఈ పాఠశాలకు కాంపౌండ్ వాల్ లేకపోవడంతో బడికి సంబంధించిన సుమారు 13 ఎకరాలు పైబడి ఉన్న స్థలము కొంతమంది అడ్డదారిలో కొంత భూమిని ఆక్రమించుకొని అనుభవిస్తున్నారు. హరితహారం లో భాగంగా వెయ్యి ముక్కలు నాటడంతో కాంపౌండ్ వాల్ లేకపోవడంతో కొన్ని మొక్కలు మాత్రమే ఉన్నాయని తెలిపారు.


ఆ స్కూలు కష్టాలు ఇంతింత కాదు
వంట షెడ్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మధ్యాహ్నం ఏజెన్సీ వారు ఆవేదన చెందారు . స్కేవేంజర్ గా పనిచేస్తున్న వ్యక్తికి గత నాలుగు నెలలుగా జీతం రాలేదని నెలకు 2500 రూపాయలు జీతం సరిపోవడం లేదని ప్రభుత్వం వేతనాలు పెంచాలని ఆయన కోరారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీ వారికి జీతం పెంచాలని వారు ప్రభుత్వాన్ని అడిగారు గతంలో అదనపు గదులు నిర్మించి ఉండగా అవి అసంపూర్తిగా మిగిలిపోయాయి దానికి కావలసిన బడ్జెట్ కేటాయించి అవి ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు .ఈ పాఠశాలకు సంబంధించి కరెంట్ బిల్లు బకాయి ఒక లక్షా 75 వేల రూపాయల వరకు ఉందని ప్రభుత్వం వెంటనే దీనిపై దృష్టి సారించి ఆ బకాయిలు చెల్లించాలని కోరారు .ఈ పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం ఈ నెల 14 నుండి బడిబాట కార్యక్రమం ప్రారంభించగా ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత పుస్తకాలు దుస్తులు బాలిక కిట్స్ ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు. స్కూలు  సమస్యలపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి తగు చర్యలు చేపట్టాలని విద్యార్ధులు కోరుతున్నారు.

No comments:
Write comments