తాను ఏ పార్టీలోకి వెళ్లడం లేదు: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

 


న్యూఢిల్లీ జూన్ 18  (globelmedianews.com)
రాష్ట్ర సమస్యలపై పార్లమెంట్‌లో గళం విప్పుతానని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన పార్లెమెంట్ సభ్యునిగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎయిమ్స్‌కు నిధులు, ఇతర అంశాలపై పార్లమెంట్‌లో పోరాడుతామని అన్నారు. తాను పార్టీ మారుతున్నట్లు వాస్తున్న వార్తలను ఖండించారు. తాను ఏ పార్టీలోకి వెళ్లడం లేదని, కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూసి.. తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి అలా మాట్లాడారని ఆయన వివరణ ఇచ్చారు.

తాను ఏ పార్టీలోకి వెళ్లడం లేదు: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

No comments:
Write comments