బహుళ అంతస్తుల భవనాల అనుమతులు మరింత సులభతరం

 


వివిధ శాఖల అనుమతులన్నీ సింగిల్ విండో విధానం ద్వారా జారీ - దానకిషోర్
హైదరాబాద్, జూన్ 28, (globelmedianews.com)
గ్రేటర్ హైదరాబాద్ లో భవన నిర్మాణ అనుమతులను మరింత సులభతరం చేసేందుకుగాను సింగిల్ విండో విధానాన్ని ప్రవేశపెడుతున్నట్టు జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్ తెలిపారు. నేడు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో టౌన్‌ప్లానింగ్ అధికారులు, బిల్డర్లు, ఫైర్ సర్వీస్‌లు, రెవెన్యూ తదితర అధికారులతో జరిగిన సమావేశంలో కమిషనర్ దానకిషోర్ పాల్గొన్నారు. సులభతర వాణిజ్యవిధానం (ఇ.ఓ.డి.బి)లో భాగంగా గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ డి.పి.ఎం.ఎస్ విధానాన్ని ప్రవేశపెట్టిందని, ఈ విధానం ద్వారా నిర్మాణ అనుమతులను నిర్ణీత సమయంలో జారీచేసినప్పటికీ ఇతర శాఖలకు సంబంధించిన అనుమతులు రావడంలో జాప్యం కలిగేదని దానకిషోర్ తెలిపారు. 


బహుళ అంతస్తుల భవనాల అనుమతులు మరింత సులభతరం

ఈ నేపథ్యంలో ఇతర శాఖలకు సంబంధించిన అనుమతులు ఆటో డి.సి.ఆర్‌లో పొందుపర్చలేనందున బహుళ అంతస్తుల భవన అనుమతులకు జాప్యం ఏర్పడుతోందని అన్నారు. ఈ విషయంలో పలుమార్లు బిల్డర్లు చేసిన విజ్ఞతలను అనుసరించి సంబంధిత శాఖలకు చెందిన అనుమతులను కూడా ఏకగవాక్షం ద్వారా అందించేందుకు కామన్ అప్లికేషన్ విధానాన్ని డి.పి.ఎం.ఎస్ లో పొందుపర్చామని వివరించారు. ఈ విధానం పూర్తిస్థాయిలో అందుబాటులోకి మరో రెండు వారాల్లో వస్తుందని తెలిపారు. కామన్ అప్లికేషన్‌తో సింగిల్ విండో విధానం ద్వారా బహుళ అంతస్తుల భవనాలకు అనుమతులు త్వరితగతిన లభించడం ద్వారా పెద్ద బిల్డర్లకు అనుకూలంగా ఉంటుందని దానకిషోర్ పేర్కొన్నారు. టౌన్‌ప్లానింగ్ విభాగంల గణనీయ మార్పులు తేవడం ద్వారా మరింత సులభతరంగా భవన నిర్మాణ అనుమతులను జారీచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పలు సంస్కరణలను ప్రవేశపెట్టనుందని కమిషనర్ వెల్లడించారు. ముఖ్యంగా 500 గజాలకన్నా తక్కువ ఉన్న స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టేందుకు వచ్చే దరఖాస్తులు నిబంధనల ప్రకారం ఉంటే ఒకే రోజులో అనుమతులను జారీచేసే ప్రతిపాదన ఉందని అన్నారు. దీంతో పాటు 200 గజాలలోపు స్థలంలో ఇళ్ల నిర్మాణానికి సెల్ఫ్ అప్రూవల్ ద్వారానే ఇళ్ల నిర్మాణం చేపట్టుకునే ప్రతిపాదనలు కూడా పరిశీలనలో ఉందని తెలిపారు. ఈ సమావేశంలో చీఫ్ సిటీ ప్లానర్ దేవేందర్‌రెడ్డి, ఆస్కికి చెందిన డా.సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. 

No comments:
Write comments