ఐరన్ లేడీగా కంగనా

 


చెన్నై, జూన్ 5 (globelmedianews.com)
త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత జీవిత నేప‌థ్యంలో ప‌లు చిత్రాలు తెర‌కెక్కుతుండ‌గా, కొన్ని ప్రీ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో ఉన్నాయి. ఎన్టీఆర్‌ ఆత్మ చెప్పిన విషయాల ఆధారంగా ‘లక్ష్మీస్‌ వీరగ్రంథం’ సినిమాను కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి రూపొందిస్తున్నారు. ఇప్పడు ఈయనే జయలలిత జీవిత నేపథ్యంలో సినిమా చేసేందుకు సిద్ధం అయ్యాడు. ‘శశి లలిత’ పేరిట తెరకెక్కనున్న ఈ చిత్రంలో జయలలిత ఆస్పత్రిలో ఉన్న 75 రోజులు ఎం జరిగింది అనేది చూపించబోతున్నారు. 


ఐరన్ లేడీగా కంగనా
మరోవైపు కోలీవుడ్‌లో జ‌య‌ల‌లిత జీవిత నేప‌థ్యంలో తమిళ దర్శకురాలు ప్రియదర్శిని ‘ది ఐరన్ లేడీ’ పేరుతో జ‌య‌ల‌లిత‌ బ‌యోపిక్ రూపొందిస్తుంది. ఇందులో నిత్యామీన‌న్ లీడ్ రోల్ పోషిస్తుంది. ఇక త‌మిళ ద‌ర్శ‌కుడు ఏఎల్‌ విజ‌య్ తాను త‌లైవీ అనే టైటిల్‌తో జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌ని తెర‌కెక్కిస్తున్నాడు. వైబ్రీ మీడియా, విష్ణు ఇందూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి విజ‌యేంద్ర ప్ర‌సాద్ క‌థ అందిస్తున్నారు. ఇందులో కంగ‌నా రనౌత్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తుంది . వంద కోట్ల బ‌డ్జెట్‌తో ఈ చిత్ర షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుతుండ‌గా, ఇందులో జ‌య‌ల‌లిత న‌ట ప్ర‌స్థానంతో పాటు రాజ‌కీయ ప్ర‌స్థానం చూపించ‌నున్నారు .

No comments:
Write comments