ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట

 


గద్వాల జోగులాంబ, జూన్ 18, (globelmedianews.com)
జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం పెద్దపోతులపాడు గ్రామ సమీపంలోని రైల్వే ట్రాక్ పై ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది.  మృతులిద్దరూ ప్రేమికులు ఉండవెల్లి మండలం ఇటిక్యాల పాడు గ్రామానికి చెందిన లోకేష్(21), మరియు కస్తూరి(17) గా గుర్తించారు. రైలు కింద పడడంతో వారిద్దరూ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. 


ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట
వీరిద్దరి కులాలు వేరు కావడంతో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ జంట లోకేష్ మరియు కస్తూరి వీరిద్దరూ ఇటుకల పాడు గ్రామానికి చెందిన తల్లిదండ్రులకు ఏకైక సంతానం కావడంతో తో ఇటిక్యాల పాడు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.. మానవ పాడు మండల పరిధిలో ప్రేమజంట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుందని తెలియగానే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు..

No comments:
Write comments