ఘనంగా పీవీ జయంతి

 


హైదరాబాద్, జూన్ 28,(globelmedianews.com):
భారత దేశ మాజీ ప్రధాని, పి.వి.నర్సింహరావు 98వ జయంతి ఉత్సవాలను శుక్రవారం నెక్లెస్ రోడ్డులోని పివి జ్ఞానభూమిలో ఆయన సమాధి  వద్ద ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి  తలసాని శ్రీనివాస్ యాదవ్, ,తెలంగాణ రాష్ట్ర బిసి కమీషన్ ఛైర్మన్   బి.ఎస్.రాములు, ప్రభుత్వ మీడియా  సలహాదారు డా.కె.వి.రమణాచారి, రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ సంచాలకుల మామిడి హరికృష్ణ పివి సమాధికి, చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.

ఘనంగా పీవీ జయంతి

 ఈ సందర్భంగా స్వర్గీయ  పివి నర్సింహరావు దేశానికి చేసిన సేవలు  గుర్తు చేసుకున్నారు. పపివి నర్సింహరావు గొప్ప రాజనీతిజ్ఞడని బహుభాషా  కోవిదుడని, తెలంగాణ బిడ్డగా కేవలం తెలంగాణాకే కాకుండా ప్రధాని పధవిని చేపట్టి యావత్ భారతదేశానికే గుర్తింపు తెచ్చిన మహనీయుడని శ్లాఘించారు. ఈ  జయంతి  ఉత్సావాలల్లో భాగంగా పివి నర్సింహారావు ను స్మరించుకుంటూ పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సమాధి దగ్గర  సర్వమత ప్రార్ధనలు, భజనలు చేశారు. పివి నర్సింహారావు జీవిత విశేషాలకు సంబంధించిన చిత్రాలతో కూడిన ఛాయచిత్ర  ప్రదర్శనను ఏర్పాటు  చేసారు.

No comments:
Write comments