సాఫ్ట్ వేర్ ఉద్యోగి దారుణ హత్య

 


కడప జూన్ 5, (globelmedianews.com)
రంజాన్ పండుగ జరుపుకోవలసిన ఇంట్లో కన్నీటి ఆర్తనాదాలు మిగిలియాయి. కడప జిల్లా రైల్వే కోడూరు పట్టణంలోని కృష్ణ థియేటర్ వద్ద అబ్దుల్ ఖాదర్ (26)  సాఫ్ట్ వేర్ ఉద్యోగిని అతి దారుణంగా హత్య చేశారు. బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న అబ్దుల్ రంజాన్ పండగ చేసుకోవడానికి బెంగళూరు నుంచి కోడూరు కి వచ్చాడు. 

సాఫ్ట్   వేర్ ఉద్యోగి దారుణ హత్య
తలిదండ్రులతో కలిసి సంతోషంగా గడుపుకుంటు బుధవారం ఉదయాన్నే పాల ప్యాకెట్ తీసుకుని ఇంటికి తిరిగి వెళుతున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి కత్తితో నరికి చంపారు. ప్రేమ వ్యవహారం ఉండవచ్చని రైల్వే కోడూరు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

No comments:
Write comments