గద్దను రక్షించిన జీహెచ్ ఎంసీ సిబ్బంది

 

హైదరాబాద్, జూన్ 20, (globelmedianews.com)
రాష్ట్ర శాసనసభ ఎదురుగా ఉన్న ఒక చెట్టుపై  పతంగు లు ఎగురవేసే చైనా మాంజా కాలికి చుట్టుకొని గద్ద కొట్టుమిట్టాడుతోంది. ఆది  ప్రమాదంలో ఉందని అందుకున్న సమాచారంతో జిహెచ్ఎంసి డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు చేరుకొని ఆ  గద్ద ను రక్షించాయి. 

గద్దను రక్షించిన జీహెచ్ ఎంసీ సిబ్బంది
వివరాలకు వస్తే, అసెంబ్లీ ఎదురుగా ఉన్న భారీ వృక్షం పై కాలికి దారం చుట్టుకొని వేలాడుతూ గ్రద్ద ఉందని అసెంబ్లీ సిబ్బంది జిహెచ్ఎంసి మేనేజ్ మెంట్ ఫోర్స్ కు సమాచారం అందించారు. దీంతో గన్ పార్క్ సమీపంలో విధుల్లో ఉన్న డిఆర్ఎఫ్ సిబ్బంది అక్కడికి చేరుకుని లాడర్ సహాయం తో గద్దను సురక్షితంగా కిందికి చేర్చారు.  దానికి సపర్యలు చేసి  తిరిగి వదిలిపెట్టారు.  ఇటీవలి కాలంలో  నల్లగండ్ల చెరువు లో పడ్డ జింకను.  ఆల్విన్ కాలనీ లో ట్యాంక్ లో పడ్డ  ఆవును రక్షించిన జిహెచ్ఎంసి డిజాస్టర్ బృందాలను అధికారులు, స్థానికులు అభినందిoచారు.

No comments:
Write comments