సమ్మూ పైనే నాగశౌర్య అశలు

 


హైద్రాబాద్, జూన్ 11, (globelmedianews.com)
తిన్ కొన్నాళ్ళు ప్లాప్స్ తో బాధపడినా.. తర్వాత ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే సినిమాల్తో హిట్ కొట్టి ఫామ్ లోకొచ్చాడు. తర్వాత ఒకట్రెండు ప్లాపులొచ్చినా… సమంత మెయిన్ పాత్రలో నితిన్ హీరోగా చేసిన అ.. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. సమంత అక్కినేని క్రేజ్, దర్శకుడు త్రివిక్రమ్ మాయాజాలంతో అ…… ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆసినిమా హిట్ కేవలం సమంత కే చెందినా అందులో హీరోగా నటించిన నితిన్ ని కూడా పొగిడేశారు. 


సమ్మూ పైనే నాగశౌర్య అశలు
అలా నితిన్ సమంత తో కలిసి నటించినందుకు అ… ఆ లాంటి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. మరి యావరేజ్ యంగ్ హీరోకి తన క్రేజ్ తో సూపర్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన సమంత ఇప్పుడు మరో యంగ్ హీరోకి హెల్ప్ అవుతుందా?పెళ్లి తర్వాత ఫుల్ జోష్ లో ఉన్న సమంత తాజాగా నందిని రెడ్డి దర్శకత్వంలో ఓ బేబీ సినిమాలో నటిస్తుంది. విడుదలకు సిద్దమవుతున్న ఈ సినిమాలో నాగ శౌర్య హీరో. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాలో మరో సీనియర్ నటి లక్ష్మి కూడా కీలక పాత్ర పోషిచింది. అయితే వరస ప్లాప్స్ తో ఉన్న నాగ శౌర్య కి ఇప్పుడు ఓ బేబీ తో సమంత హిట్ కొట్టి నాగ శౌర్య కి మేలు చేస్తుందా… ! సమంత క్రేజ్ తో ఓ బేబీ మీద ట్రేడ్ లో మంచి అంచనాలున్నాయి. ఒక వేళా సమంత ఓ బేబీ హిట్ అయితే ఆ హిట్ నాగ శౌర్య ఖాతాలోకి వస్తుంది. అప్పట్లో అ…. ఆ హిట్ తో నితిన్ క్రేజ్ పెరిగినట్లు ఇప్పుడు ఓ బేబీ హిట్ అయితే నాగ శౌర్య క్రేజ్ అమాంతం పెరగడం ఖాయం. మరి ఓ బేబీ లో హీరోగా చిన్న రోల్ ప్లే చేసిన నాగ శౌర్య కి సమంత తో క్రేజ్ తో హిట్ అందుకుని తన ఖాతాలోకి వేసుకోవాలని తహతహలాడుతున్నాడు. చూద్దాం నితిన్ కి హిట్ ఇచ్చిన సమంత..,.. నాగ శౌర్యకి ఏ మాత్రం ఉపయోగపడింది అనేది తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే

No comments:
Write comments