ప్రొటెం స్పీకర్ గా అప్పలనాయుడు

 

విజయనగరం, జూన్ 5 (globelmedianews.com)

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభకు ప్రొటెం స్పీకర్‌గా విజయనగరం జిల్లాకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు నియమితులయ్యే అవకాశం కనిపిస్తుంది. ఏపీలో రెండవసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైసీపీ త్వరలో అసెంబ్లీని ఏర్పాటు చేయనుంది. ఈ అసెంబ్లీ సమావేశం మొదటిరోజు ప్రొటెం స్పీకర్‌ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. సభలో ఎక్కువసార్లు ఎన్నికైన వ్యక్తిని ప్రొటెం స్పీకర్‌గా నియమిస్తారు. 


ప్రొటెం స్పీకర్ గా అప్పలనాయుడు
ఈ క్రమంలోనే నూతనంగా సమావేశం కానున్న అసెంబ్లీకి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన బొబ్బిలి శాసనసభా నియోజకవర్గం ఎమ్మెల్యే శంబంగి ప్రొటెం స్పీకర్ కానున్నారు.2019లో జరిగిన ఎన్నికల్లో మాజీ మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావును ఓడించిన అప్పలపాయుడు ప్రొటెం స్పీకర్‌గా నియమితుయ్యాక అసెంబ్లీ సమావేశాల తొలి రోజున కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో పదవీ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ తరువాత శాసనసభ స్పీకర్‌ ఎన్నికను కూడా నిర్వహిస్తారు. కొత్తగా ఎన్నికైన స్పీకర్‌కు పదవీ బాధ్యతలు అప్పగించిన తరువాత ప్రొటెం స్పీకర్ పదవీకాలం ముగుస్తుంది.

No comments:
Write comments