బీహార్ జర్నలిస్ట్ లకు పెన్షన్

 


పాట్న(globelmedianews.com)
రిటైరైన జర్నలిస్ట్ లకు నెలకు 6వేల రూపాయల పెన్షన్ ఇచ్చేందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్  ప్రభుత్వం నిర్ణయించింది.60సంవత్సరాల వయసు నిండి, ఒకే సంస్థ లోగాని, అంతకు మించి ఎక్కువ సంస్థల్లో గాని, కనీసం 20 సంవత్సరాలు  లేదా అంతకు మించి ఎక్కువ పాత్రికేయ సర్వీస్ కలిగిన   జర్నలిస్టులు, ఈ పెన్షన్ కు అర్హులు. 


 బీహార్  జర్నలిస్ట్ లకు పెన్షన్
ఎడిటర్, సబ్ ఎడిటర్, రిపోర్టర్, ఫోటోగ్రాఫర్, వంటి అన్ని కేటగరీ ల పాత్రికేయులు, దిన,వార,మాస పత్రికలు, ఛానళ్ళు,పోర్టల్ లలో పనిచేసే వారందరూ దీనికి అర్హులు.ఈ ఏడాది  ఏప్రిల్ 1 నుండి ఈ పథకం అమలు లోకి వస్తున్నది.పెన్షన్ పొందుతూ జర్నలిస్ట్ మృతి చెందితే జీవిత భాగ స్వామి కి నెలకు మూడు వేలు రూపాయలు చొప్పున  పెన్షన్ ఇస్తారు. బీహార్ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ ఈ పథకాన్ని స్వాగతించింది.

No comments:
Write comments