పాఠశాల విద్యలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి

 


హైదరాబాద్ జూన్ 12 (globelmedianews.com)

రాష్ట్రంలో పాఠశాల విద్యలో నిలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్ డిమాండ్ చేసింది.   ప్రైవేట్ విద్యా సంస్థలు ఇష్టానుసారంగా ఫీజులు పెంచి, ధనార్జనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. ప్రతి పాఠశాల ఫీజుల వివరాలను వెల్లడించాలని,   ఫీజు నియంత్రణ చట్టం అమలు పరచాలి. ప్రతి పాఠశాలలో పేరెంట్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని, అవి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయికి కూడా విస్తరించాలని,   విద్యా హక్కు చట్టాన్ని ఈ విద్య సంవత్సరమే పటిష్టంగా అమలు పరచాలి పేద విద్యార్థులకు 25 %సీట్లు కేటాయించాలని, .  పాఠశాల ఆవరణలో ఎలాంటి అమ్మకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని,


పాఠశాల విద్యలో  నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి 
5).  బస్సుల ఫిటినెస్ పరీక్షించే విధంగా చూడాలి.గ్రౌండ్,లాబ్స్, ఫైర్ సేఫ్టీ,టాయిలెట్స్ తదితర కనీస సౌకర్యాలు ఉన్నాయో లేవో గుర్తించి ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని,   ఖాళీగా ఉన్న డిఇఓ,ఎంఇఓ పోస్టులను భర్తీ చేయాలని, .  ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసి పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని, . గుర్తింపు లేని పాఠశాలలు గుర్తించి, అనుమతులు తీసుకునే విధంగా చూడాలి. లేని యెడల క్రిమినల్ కేసులు నమోదు చేసి,ఆ లిస్ట్ బహిర్గతం చేయాలని, పై సమస్యలు పరిష్కరించవలసింది గా ఏబీవీపీ తెలంగాణ శాఖ రాష్ట్ర శాఖ విజ్ఞప్తి చేసింది.  

No comments:
Write comments