సైరాకు కనిపించని క్రేజ్

 


హైద్రాబాద్, జూన్ 5 (globelmedianews.com)
రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా నుండి ఒక పోస్టర్ విడుదలైన, లేదంటే ఏదో ఓ లుక్ విడుదలైనా.. పేక్షకులకు పండగలా ఉండేది. కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. మిగతా ప్రేక్షకులు కూడా బాహుబలి సినిమా చూసేందుకు ప్రత్యేకమైన ఆసక్తి కనబర్చారు. భారీ బడ్జెట్ తో రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి విడుదలకు ముందే ప్రేక్షకుల్లో పిచ్చ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడంతో సినిమా అక్కడే సగం సక్సెస్ అయ్యింది. రాజమౌళి కూడా తన సినిమా మీద అంతే క్రేజ్ వచ్చేలా ప్లాన్ చెయ్యడంతో జనాల్లోకి బాహుబలి అలా దూసుకెళ్లింది. ఇక సినిమా విడుదల దగ్గరపడే కొద్దీ.. బాహుబలి క్రేజ్ ఆకాశాన్నంటింది.


సైరాకు కనిపించని క్రేజ్ 
అయితే తాజాగా రెండు పెద్ద సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయంటే… ప్రేక్షకుల్లో ఎందుకో పెద్దగా ఆసక్తి క్రియేట్ అయినట్లుగా అనిపించడం లేదు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరు హీరోగా తెరకెక్కుతున్న సై రా నరసింహారెడ్డి సినిమా అక్టోబర్ 2 న విడుదల అంటూ ప్రచారం జరుగుతుంది. కానీ క్లారిటీ లేదు. ఇక సినిమా మీద క్రేజ్ ఉంది కానీ.. ఓ అన్నంతగా కనిపించడం లేదు. కారణం తెలియడం లేదు. కానీ ఎక్కడో ఏదో కొడుతోంది. బాహుబలి మాదిరి మాత్రం సై రా మీద ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ కనిపించడం లేదు. మరి ప్రేక్షకులకు కావాల్సిన ప్రమోషన్స్ సై రా నుండి రావడం లేదు. ఇక ప్రభాస్ సాహో కూడా సుదీర్ఘంగా ఇండియా వైడ్ గా తెరకెక్కుతుంది. ఆ సినిమా కూడా పోస్టర్ రిలీజ్ అయినప్పుడు, ఇక ఈ రోజు విడుదల కాబోయే టీజర్ లాంటి సమయాల్లోనే ఆ సినిమా ముచ్చట్లు ప్రేక్షకుల దగ్గర వినబడుతుంది. కానీ తర్వాత అంతా కామ్. మరి ఈ రెండు పెద్ద ప్రాజెక్ట్స్ భారీ బడ్జెట్ తో నిర్మాతలు తెరకెక్కిస్తున్నారు. సినిమాలు విడుదలకు దగ్గరపడుతుంటే.. ఆ సినిమాల మీద క్రేజ్ కావలిసినంత మాత్రం రావడం లేదనేది పక్కా..!

No comments:
Write comments