ఆర్టీసీ కార్మికుల ఒకరోజు సమ్మె

 


యాదాద్రి జూన్ 26 (globelmedianews.com
యాదగిరిగుట్ట పట్టణంలోని బస్ డిపో ఎదుట కార్మికులు ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనియం చేయాలని డిమాండ్ చేస్తూ ఓక్కరోజు నిరాహరదీక్ష చేపట్టారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనియం చేస్తే బస్సులు తెలంగాణా రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు పల్లె పల్లెకు  బస్సులు వెళతాయి. ప్రజలకు రవాణా సౌకర్యం ఏర్పాటు అవుతుందన్నారు. ప్రైవేట్ వాహనాలలో ప్రయాణం చేసి ఎంతో మంది ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. 

ఆర్టీసీ కార్మికుల ఒకరోజు సమ్మె

గాయాల పాలౌతున్నారు. ప్రభుత్వం సమస్యను పూర్తిగా అవగాహన చేసుకుని ప్రజలవద్దకు ప్రభుత్వం బస్సులు నడిచే విదంగా టిఎస్ ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనియం చేయాలని కార్మికులు కోరారు. అప్పట్లో తెలంగాణా ఉద్యమ సమయంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు యాదగిరిగుట్ట పట్టణంలోని  బస్టాండ్ లోకి వచ్చి మాతో నేరుగా వచ్చి కలసి తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు అయితే మెుదటిసారిగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనియం చేస్తానని అన్నారు.  పక్కరాష్ట్రం ముఖ్యమంత్రి జగన్ ఎలక్షన్స్ ముందు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనియం చేస్తానని మాట ఇచ్చారు. నెల రోజులలోనే విలీనం చేశారు.  మన ముఖ్యమంత్రి రెండవ సారి కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయినా ఆర్టీసీ కార్మికులు గోడు వినిపించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .

No comments:
Write comments