పెట్రోల్, డీజిల్ వాహనాలు బంద్.. అన్నీ ఎలక్ట్రికే!

 


న్యూఢిల్లీ, జూన్ 18 (globelmedianews.com)
దేశంలో డీజిల్, పెట్రోల్ వాహనాల వినియోగం తగ్గితే.. భారత్కు ముడి చమురు దిగుమతుల భారం దిగివస్తుంది. విదేశాల నుంచి ఇండియా క్రూడాయిల్ కొనుగోలుకు భారీగా ఖర్చు చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే వాయు కాలుష్యం కూడా తగ్గుతుంది. బైక్ నడిపేవారు వారి వాహనానికి పెట్రోల్ కొట్టిస్తారు. అదే కారు కలిగి ఉన్నవారు పెట్రోల్ లేదా డీజిల్ తో వాహన ట్యాంక్ నింపుతారు. అయితే భవిష్యత్లో పెట్రోల్, డీజిల్ వాహనాలు కనుమరుగయ్యే అవకాశముంది. ఎందుకంటారా? కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. నీతి ఆయోగ్ తాజాగా కేంద్ర ప్రభుత్వానికి ఒక సిఫార్సు చేసింది. 


పెట్రోల్, డీజిల్ వాహనాలు బంద్.. అన్నీ ఎలక్ట్రికే!
ఇందులో 2030 తర్వాత దేశంలో కేవలం ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే విక్రయించాలని ఉంది. అంటే డీజిల్, పెట్రోల్ వెహికల్స్ బంద్ కావొచ్చు. అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ కు సంబంధించి ప్రతి శాఖకు తగిన బాధ్యతలు అప్పగించాలని కేంద్రాన్ని కోరింది.  కేంద్ర రోడ్డు రవాణా శాఖ 2030 కల్లా డీజిల్, పెట్రోల్ వాహనాలను తొలగించేందుకు దశల వారీగా తగిన నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఇందులో భాగంగానే ఇ-హైవేస్ ప్రోగ్రామ్ ను కూడా లాంచ్ చేయొచ్చు. ఇందులో ఎంపిక చేసిన జాతీయ రహదారుల్లో ఎలక్ట్రిక్ బస్సులను, ట్రక్కులను నడుపుతారు. దీనికి అవసరమైన ఎలక్ట్రిక్ నెట్వర్క్ను ఏర్పాటు చేస్తారు. అప్కమింగ్ ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వేను ఈ-హైవేగా తీర్చిదిద్దుతామని కేంద్ర రోడ్డు రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. దేశంలో డీజిల్, పెట్రోల్ వాహనాల వినియోగం తగ్గితే.. భారత్కు ముడి చమురు దిగుమతుల భారం దిగివస్తుంది. విదేశాల నుంచి ఇండియా క్రూడాయిల్ కొనుగోలుకు భారీగా ఖర్చు చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే వాయు కాలుష్యం కూడా తగ్గుతుంది. 

No comments:
Write comments