మాగంటి ముందుంది ముసళ్ల పండుగే

 


ఏలూరు, జూన్ 10, (globelmedianews.com)
మాగంటి వెంక‌టేశ్వ‌ర‌రావు, ఉర‌ఫ్ మాగంటి బాబు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఏలూరుకు చెందిన ఈయ‌న సుదీర్గ రాజ‌కీయ కుటుంబం నుంచి వ‌చ్చిన సీనియ‌ర్ నాయ‌కుడు. కాంగ్రెస్ త‌ర్వాత టీడీపీలోనూ త‌న‌దైన శైలిలో రాజ‌కీయాలు చేసిన వ్య‌క్తిగా తెలుగు రాష్ట్రాల్లో పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు, రాజ‌కీయంగా అజాత శ‌త్రువుగా ఆయ‌న పేరు తెచ్చుకు న్నారు. తెలుగు సంస్కృతి సాంప్ర‌దాయాల‌కు పెద్ద పీట వేసే మాగంటి.. ఎన్ని ఇబ్బందులు వ‌చ్చినా.. కోడి పందేల‌ను మాత్రం వ‌ద‌ల‌కుండా నిర్వ‌హిస్తూ.. బ్రాండ్ పేరు తెచ్చుకున్నారు. అయితే, తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ సునామీ ముందు మాగంటి నిల‌బ‌డ‌లేక పోయారు.త‌న తండ్రి మాగంటి ర‌వీంద్ర‌నాథ్ చౌద‌రి, మాగంటి వ‌ర‌ల‌క్ష్మీదేవి రాజ‌కీయ వార‌స‌త్వాన్ని అందిపుచ్చుకుని రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ఆయ‌న వారి పంథాలోనే మంత్రి అయ్యారు. ముందుగా కాంగ్రెస్ నుంచి ఏలూరు ఎంపీగా మూడుసార్లు పోటీ చేసి ఓసారి గెలిచిన ఆయ‌న 2004లో కాంగ్రెస్ నుంచి దెందులూరులో ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. మూడేళ్ల‌కు వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి త‌న కేబినెట్‌లో ఛాన్స్ ఇచ్చారు. 


మాగంటి ముందుంది ముసళ్ల పండుగే

అయితే, త‌ర్వాత ఒక జెడ్పీ ఎన్నిక‌ల్లో పార్టీ ఓట‌మి కావ‌డంతో అనూహ్యంగా వైఎస్ ఈయ‌న‌తో మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేయించారు. ఆ త‌ర్వాత ఆయ‌న కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పేశారు.2009లో కాంగ్రెస్ నుంచి ఏలూరు ఎంపీగా టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిన త‌ర్వాత 2014లో ఏలూరు ఎంపీగా విజ‌యం సాధించారు. అయితే, మ‌ధ్య‌లోనే ఆయ‌న‌కు అనారోగ్యం చేసి రాజ‌కీయాల్లో మునుప‌టి అంత యాక్టివ్ కాలేక‌పోయారు. ఈ క్ర‌మంలోనే త‌న కుమారుడు రాంజీని రాజ‌కీయాల్లోకి తెచ్చారు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా తెలుగు యువత అధ్య‌క్షుడిని చేశారు. కుదిరితే.. తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో నిల‌బెట్టాల‌ని భావించా రు. అయితే, అవ‌కాశం లేక పోవ‌డంతో మాగంటే పోటీ చేశారు. ఇక‌, గ‌తానికి భిన్నంగా ఈ ద‌ఫా మాగంటి ఫ్యామిలీ మొత్తం కూడా వ‌చ్చి ప్ర‌చారం చేసింది. అయిన‌ప్ప‌టికీ.. గెలుపు గుర్రం ఎక్క‌లేక పోయారు. దీంతో మ‌రో ఐదేళ్ల‌పాటు ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల‌కు దూరంగానే ఉండాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. వ‌చ్చే 2024 నాటికి మాగంటి ప‌రిస్థితి ఏంట‌నే ప్ర‌శ్న తెర‌మీదికి వ‌స్తోంది. ఇప్ప‌టికే వ‌య‌స్సు పైబ‌డ‌డంతో పాటు… పెద్ద‌గా నియో జ‌క‌వ‌ర్గంలో తిరిగే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఆయ‌న ప్ర‌త్యక్ష రాజ‌కీయాల్లో పాల్గొనే ప‌రిస్థితి ఉండ‌ద‌ని అంటున్నారు. ఈ నేప‌థ్య‌లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న కుమారుడికి అవ‌కాశం ఇప్పించుకునే ఛాన్స్ ఉంద‌ని అంటున్నారు. అయితే అప్ప‌టి ఈక్వేష‌న్ల ఎలా ? ఉంటాయో ? 2024 రాజ‌కీయాలు ఎలా ? ఉంటాయో ? ఏం జరుగుతుందో చూడాలి

No comments:
Write comments