న‌గ‌ర‌వాసుల‌కు నాణ్య‌మైన మాంసాహారాన్ని అందించేందుకు చ‌ర్య‌లు

 


హైదరాబాద్, జూన్ 20, (globelmedianews.com)
గ్రేట‌ర్ హైద‌రాబాద్ వాసుల‌కు ఆరోగ్య‌క‌ర‌మైన, నాణ్య‌మైన మాంసాహారాన్ని అందించ‌డానికి అక్ర‌మ స్లాట‌రింగ్‌ను నిరోధించ‌డం, అన్ని మ‌ట‌న్ షాప్‌ల‌కు లైసెన్స్‌ లు జారీచేయ‌డంతో పాటు న‌గ‌రంలో వీధికుక్క‌ల స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించేందుకు త‌గు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ ఎం.దాన‌కిషోర్ అధికారుల‌ను ఆదేశించారు. జీహెచ్ఎంసీ వెట‌ర్న‌రీ విభాగం ప‌నితీరుపై స‌మీక్ష స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా క‌మిష‌న‌ర్ మాట్లాడుతూ హైద‌రాబాద్ న‌గ‌రంలో దాదాపు 8ల‌క్ష‌ల వీధికుక్క‌లు ఉన్నాయ‌ని ఒక‌ అంచ‌నా కాగా వీటికి సంతానాభివృద్ది కాకుండా ఆప‌రేష‌న్ల‌ను ప‌కడ్బందీగా నిర్వ‌హించాల‌ని సూచించారు. 


న‌గ‌ర‌వాసుల‌కు నాణ్య‌మైన మాంసాహారాన్ని అందించేందుకు చ‌ర్య‌లు
న‌గ‌రంలో జీహెచ్ఎంసీ ద్వారా ఐదు ఎనిమ‌ల్ కేర్ సెంట‌ర్ల ద్వారా రోజుకు 300 వీధికుక్క‌ల‌కు ఆప‌రేష‌న్లు నిర్వ‌హిస్తున్నామ‌ని తెలిపారు. దాదాపు 80ల‌క్ష‌ల జ‌నాభా ఉన్న హైద‌రాబాద్ న‌గ‌రంలో 80శాతం మంది మాంసాహార ప్రియుల‌ని, వీరికి నాణ్య‌మైన ఆహారాన్ని అందించడానికి కృషిచేయాల‌ని అన్నారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో 3,553 లైసెన్స్ పొందిన మ‌ట‌న్ షాపులు ఉన్నాయ‌ని, మ‌రో 3వేల‌కు పైగా లైసెన్స్‌లేనివి కూడా ఉంటాయ‌ని, అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ లైసెన్స్‌లేని మ‌ట‌న్‌షాపుల‌న్నింటికి లైసెన్స్‌లు జారీచేయాల‌ని సూచించారు. న‌గ‌రంలో ఎనిమ‌ల్ క్రిమ‌టోరియం ఏర్పాటుకు చర్య‌లు చేప‌ట్టామ‌ని, దీనికి సంబంధించి టెండ‌ర్ ప్ర‌క్రియ పురోగ‌తిలో ఉంద‌ని తెలిపారు. ఈ స‌మావేశంలో చీఫ్ వెట‌ర్న‌రీ ఆఫీస‌ర్ వెంక‌టేశ్వ‌ర్‌రెడ్డి ఇత‌ర వెట‌ర్న‌రీ అధికారులు పాల్గొన్నారు.

No comments:
Write comments