చిన్నా రెడ్డి వ్యాఖ్యలు హేయనీయం: బండారు దత్తాత్రేయ

 

హైదరాబాద్ జూన్ 27 (globemedianews.com);
మాజీ ప్రధాన మంత్రి పి వి నర్సింహారావు మీద కాంగ్రెస్ నేత మాజీ మంత్రి  చిన్నా రెడ్డి చేసిన వ్యాఖ్యలు హేయనీయమని, కేవలం రాజకీయ ప్రేరేపితమైనవని మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు.  పివి నర్సింహారావు ను బిజెపి కీర్తించడానికి కారణం వారు 1991 లో మునిగిపోతున్న భారత దేశ ఆర్ధిక వ్యవస్థను చక్కదిద్దడానికి నెహ్రూవియన్ సోషలిజం పేరుతొ దేశాన్ని, దేశ ఆర్ధిక అభివృద్ధి దశను మార్చి సంస్కరణలు వేగవంతం చేయడమేనన్నారు. అనేక ఆర్ధిక సంస్కరణలకు వారు ఆధ్యుడయ్యారు. అటల్ బిహారీ వాజపేయి నేతృత్వంలోని ఎన్ డి ఏ ప్రభుత్వం అవే సంస్కరణలను ముందుకు తీసుకు వెళ్ళింది.  
చిన్నా రెడ్డి వ్యాఖ్యలు హేయనీయం: బండారు దత్తాత్రేయ

అందులోనూ తెలుగు వాడైనా మాజీ ప్రధాన మంత్రి  పివి నర్సింహారావు గారిపై ఈ విధంగా మాట్లాడడం విచారకరమన్నారు.తెలుగు బిడ్డ పివి నర్సింహా రావు ప్రధాన మంత్రి ఐతే, వారు చనిపోయాక కాంగ్రెస్ పార్టీ నాటి అధ్యక్షురాలైన శ్రీమతి సోనియా గాంధీ ఆయన భౌతిక శరీరానికి కనీస గౌరవ మర్యాదలు చేయలేదు.  పదేండ్లు అధికారంలో ఉన్నా, కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఏ ప్రభుత్వం ఢిల్లీ లో ఆయనకు ఒక్క స్మారక నిర్మాణం కూడా ఏర్పాటు చేయలేదు. ఇక మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖేర్జీ కి భారత రత్న ఇవ్వడం పట్ల చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర గర్హనీయం. ప్రణబ్ ముఖేర్జీ కి భారత రత్న ఇచ్చింది కేవలం వారు దేశానికి, దేశ ప్రజలకు అందించిన సేవలకు గుర్తింపుగానే కానీ, ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో ఉపన్యసించినందుకు కాదు.  ఆర్ఎస్ఎస్ ను పొగిడినందుకే భారత రత్న ఇచ్చారన్న వార్తలు సత్యదూరం.  మంత్రి గా పనిచేసి, ప్రస్తుతం జాతీయ కాంగ్రెస్ కార్యదర్శిగా ఉన్న వ్యక్తి మాజీ రాష్ట్రపతి పై అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరం. 

No comments:
Write comments