రోడ్డు ప్రమాద క్షతగాత్రులను ఆదుకున్న మంత్రి అళ్ల

 

ఏలూరు, జూన్ 14 (globelmedianews.com

జాతీయ రహదారి పై కళ్లెదుటే జరిగిన రోడ్దు ప్రమాదంలో గాయపడి విలవిలలాడుతున్న ముగ్గురు వ్యక్తులను చూసిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి   ఆళ్ల నాని హుటాహుటిన తనకాన్వాయ్ కారును ఆపి ఆ ముగ్గురు వ్యక్తులను సమీపంలోని మణిపాల్ ఆసుపత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు. శుక్రవారం ఏలూరు నుండి అమరావతిలోని అసెంబ్లీకి వెళుతున్న ఆళ్లనాని విజయవాడ దాటుతుండగా కళ్లెదుటే ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీ కొనడంతో ముగ్గురు వ్యక్తులు గాయపడి బాధపడుతున్న దృశ్యాన్ని చూసిన మంత్రి హృదయం చలించిపోయి వెంటనే కారును ఆపి బాధితులను ఆసుపత్రికి తరలించారు. 


రోడ్డు ప్రమాద క్షతగాత్రులను ఆదుకున్న మంత్రి అళ్ల
బాధితులకు రోడ్దుపైనే ప్రధమచికిత్సచేయించి ఆసుపత్రికి తరలించగా అక్కడ ముగ్గరులో ఇద్దరికి ప్రాధమికి చికిత్స అనంతరం డాక్టర్లు పంపించివేయగా ఒక వ్యక్తిని మైరుగైన చికిత్సకోసం ఆసుపత్రిలో చేర్చగా మంత్రి  స్వయంగా ఆసుపత్రికి వచ్చి బాధితుణ్ణి పరామర్శించడమే కాకుండా తన స్వంతసొమ్ము రు .10 వేలు బాధితునికి ఇచ్చి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. గాయపడిన వ్యక్తి గుంటూరు సమీపంలోని వెంకటాయపాలెంకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే భాదితులను సకాలంలో ఆసుపత్రికి తరలించడంవల్ల ప్రమాదం తప్పింది.  

No comments:
Write comments