విజ‌య నిర్మ‌ల మృతి ప‌ట్ల సీఎం జ‌గ‌న్ సంతాపం

 


అమరావతి జూన్ 27 (globelmedianews.com)
ప్ర‌ముఖ న‌టి, ద‌ర్శ‌కురాలు విజ‌య నిర్మ‌ల మృతి ప‌ట్ల ఏపీ సీఎం జ‌గ‌న్ సంతాపం వ్య‌క్తం చేశారు. ఆమె మ‌ర‌ణం చిత్ర ప‌రిశ్ర‌మ‌కి తీర‌ని లోటు అని అన్నారు. అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళగా ఆమె గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కారని గుర్తు చేశారు. 

విజ‌య నిర్మ‌ల మృతి ప‌ట్ల సీఎం జ‌గ‌న్ సంతాపం
ఆమె కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కృష్ణ గారికి, న‌రేష్‌కి ఆత్మ స్థైర్యాన్ని ఇవ్వాల‌ని కోరుకుంటున్నాను అని జ‌గ‌న్ అన్నారు. విజయ నిర్మల గత రాత్రి గుండెపోటుతో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో మృతి చెందిన సంగ‌తి తెలిసిందే . ఆమె పార్థివదేహాన్ని ఉదయం 11 గంటలకు నానక్‌రామ్‌గూడలోని ఆమె స్వగృహానికి తీసుకొస్తారు. అభిమానుల సందర్శనార్థం నేడు అక్కడే ఉంచి రేపు ఉదయం ఫిలించాంబర్‌కు తరలిస్తారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహిస్తారు.

No comments:
Write comments