సచివాలయానికి రానివారికి కొత్తదెందుకు?:బిజేపి లక్ష్మణ్‌

 

హైదరాబాద్‌ జూన్ 25 (globelmedianews.com): 
సచివాలయానికి రాని కేసీఆర్‌కు కొత్త సచివాలయం ఎందుకని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబాన్ని రాజకీయ నిరుద్యోగులుగా చేసేంత వరకు నిద్రపోయేది లేదని స్పష్టంచేశారు. మజ్లిస్ నేతలకు భయపడి కేసీఆర్‌ తెలంగాణ విమోచన దినం జరపడం లేదని దుయ్యబట్టారు. 

సచివాలయానికి రానివారికి కొత్తదెందుకు?:బిజేపి లక్ష్మణ్‌
భాజపా అధికారంలోకి వస్తే విమోచన దినాన్ని అధికారికంగా జరుపుతామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వంపై ప్రజలు విసిగిపోయారని చెప్పారు. రాష్ట్రంలో పోలీసులు తెరాస ఏజెంట్లుగా మారారని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ కుటుంబం నుంచి తెలంగాణను విముక్తి చేసే వరకు యాత్రలు చేస్తూనే ఉంటామని లక్ష్మణ్ అన్నారు 2023 ఎన్నికల్లో గోల్కొండ ఖిల్లా మీద కాషాయ జెండా ఎగరవేస్తామన్నారు.

No comments:
Write comments