పట్టని నాయకులు…పరేషన్ లో ప్రజలు

 


చినుకు పడితే చాలు రోడ్డు చిత్తడే
వనపర్తి జూన్ 8  (globelmedianews.com)
 వనపర్తి జిల్లా గోపాల్ పేట బస్టాండ్ నుంచి చాకల్ పల్లి వెళ్లే దారిని ఎవరు పట్టించుకోక పోవడం వల్ల ప్రజలు పరేషాన్ లో పడ్డారు. ఈ మట్టి రోడ్డుపై చినుకు పడింది అంటే చాలు రోడ్డంతా చిత్తడి గా మారి నడపటానికి నరక యా తనంగా మారుతుంది. శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి రోడ్డంతా జలమయమై వాహనాల వారిని. ప్రజలను. ప్రయాణీకులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. 


పట్టని నాయకులు…పరేషన్ లో ప్రజలు
సుమారు 200 ఫీట్ల ఉన్న ఈ మట్టి రోడ్డుపై నాయకులు. అధికారులు. కలెక్టర్లు వెళుతూ పరిస్థితిని గమనిస్తున్న కూడా ఎవరు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం వల్ల ప్రజలకు శాపంగా మారింది. ఈ పరిస్థితి నెలకొని సంవత్సరాలు గడుస్తున్నా కూడా రోడ్డు నిర్మాణం జరగకపోవడం శోచనీయం. రోడ్డు పరిస్థితి ఇలా ఉంటే ఇక కరెంటు పరిస్థితి అద్వాన్నంగా మారింది. ఉరుములు. మెరుపులు గాలులు వీచి వర్షం కురిసిన కరెంట్ కట్. ఒకపక్క రోడ్డు నిర్మాణం జరుగక మరో పక్క కరెంట్ కట్ అవుతున్నా కూడా అధికారులు చర్యలు చేపట్టకపోవడంపై ప్రజల ఆ ప్రాంత ప్రజలు. వాహనాల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

No comments:
Write comments