సూపర్ మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం

 


కాకినాడ జూన్ 19 (globelmedianews.com)
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని గ్లాస్హౌస్ సెంటర్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం అర్ధరాత్రి దాటాక గ్లాస్హౌస్ సెంటర్లో ఉన్న ఓ సూపర్ మార్కెట్లో భారీ స్థాయిలో మంటలు చెలరేగాయి. మూడు అంతస్తులకు ఈ మంటలు వ్యాపించాయి.  దాదాపు రూ.2 కోట్ల వరకూ ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం.  అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని నాలుగు అగ్నిమాపక శకటాలతో మంటలార్పారు. 


సూపర్ మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం
మంటల తీవ్రత చేయిదాటిపోవడంతో పెద్దాపురం, పిఠాపురం నుంచి మరో నాలుగు అగ్నిమాపక శకటాలను తరలించినట్లు ఆ శాఖ అధికారులు వెల్లడించారు.ప్రమాదానికి గురైన భవనం ఇరుకు వీధుల్లో ఉండడంతో అక్కడికి వెళ్లే వీలు లేకుండా అగ్ని మాపక సిబ్బంది ఇబ్బందులు పడ్డారు. ఈ భవనానికి ఎలాంటి భద్రతా ప్రమాణాలు లేవని తెలిపారు. భవనంలో ప్లాస్టిక్, స్కూల్ బ్యాగులు, బట్టల దుకాణాలు ఉండడంతో మంటల తీవ్రత బాగా పెరిగిందని అధికారులు అంచనా వేశారు.

No comments:
Write comments