కూరవి లో కార్డాన్ సర్చ్

 


మహబూబాబాద్, జూన్ 27, (globelmedianews.com)
మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో గురువారం ఉదయం పోలీసులు కార్డాన్ సర్చ్ నిర్వహించారు. ఉదయం 5 గంటల నుండి సుమారు 100 మంది పోలీసులు 2 గంటలు పాటు ప్రతి ఇల్లును తనిఖీ చేశారు. సరి అయిన పత్రాలు లేని  50 మోటారు సైకిల్ లను, ఒక  ఆటో, పది  గ్యాస్ సిలిండర్ లు, 


 కూరవి లో కార్డాన్ సర్చ్
,టపాసులు సుమారు 25000, మద్యం సీసాలు, 20 లీటర్ల గుడంబ,  50 కేజీల నల్ల బెల్లం, ,అనుమతి లేని ఇసుక ట్రాక్టర్,  గుట్కాలు ప్యాకిట్ లను స్వాధీనం చేసుకున్నారు . ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ  నంద్యాల కోటి రెడ్డి, డీఎస్పీ,  నరేష్ కుమార్, సిఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

No comments:
Write comments