పోలీసు ఉద్యోగాలకు ధృవపత్రాల పరిశీలన ప్రారంభం

 

మహబూబ్ నగర్  జూన్ 14 (globelmedianews.com

పోలీస్ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ పోలీసు సంబంధిత ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో భాగంగా ధృవ పత్రాల పరిశీలన శుక్రవారం ఉదయం నుండి పోలీసు హెడ్ క్వార్టర్స్ లో ప్రారంభమైంది. ఈనెల 22వ తేదీ వరకు కొనసాగనున్న ఈ పరిశీలన కార్యక్రమాన్ని క్రమపద్ధతిలో సీరియల్ నంబర్ల వారీగా నిర్వహించనున్నట్లు అదనపు ఎస్.పి.  ఎన్.వెంకటేశ్వర్లు తెలిపారు. ధృవ పత్రాల పరిశీలన సందర్భంగా, రాష్ట్ర పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు వారు జారీ చేసిన ఇంటిమేషన్ లెటర్ లో సూచించిన విధంగా తగిన పత్రాలతో అభ్యర్థులు హాజరు కావాలని, ఎటువంటి ఆందోళన చెందకుండా, పోలీసు అధికారులు సూచించిన విధంగా అభ్యర్థులు నడుచుకోవాలని అధికారి తెలిపారు. 


పోలీసు ఉద్యోగాలకు ధృవపత్రాల పరిశీలన ప్రారంభం
ఏరోజుకారోజు అభ్యర్థుల ధృవ పత్రాలను పూర్తిస్థాయిలో పరిశీలన గావించిన తదుపరి సంబంధిత అధికారులు తగిన సూచనలు చేస్తారని వివరించారు. అభ్యర్థుల పలు సందేహాలను అదనపు ఎస్.పి. నివృత్తి చేస్తూ, రిక్రూట్మెంట్ బోర్డు వారు జారీ చేసిన ఇంటిమేషన్ లెటర్ లో పూర్తి వివరాలు ఉంటాయని, ఒకటిరెండుసార్లు శ్రద్ధగా చదవాలని అభ్యర్థులకు సూచించారు. ధృవ పత్రాల పరిశీలన ప్రశాంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశామని అదనపు ఎస్.పి. తెలిపారు. ఈ సందర్భంగా డి.ఎస్.పి.లు  బి.భాస్కర్, జి.గిరిబాబు, ఏ.ఓ. కృష్ణమోహన్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ దిలీప్ ఇతర అధికారులు, మినిస్టీరియల్ సిబ్బంది పాల్గొన్నారు.

No comments:
Write comments