సమాచార భద్రతకోసం విస్తృతమైన ఆలోచనలు రావాలి

 


ఉపరాష్ట్రపతి వెంకయ్య 
హైదరాబాద్, జూన్ 6, (globelmedianews.com)
సమాచార భద్రత కోసం విస్తృతమైన ఆలోచనలు మరియు వినూత్న ఆవిష్కరణల కోసం ఉపరాష్ట్రపతి  ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం నేపథ్యంలో సైబర్ భద్రత తప్పనిసరి అంశంగా మారిందని తెలిపారు. హైదరాబాద్ లోని సి.ఆర్.రావ్ అడ్వాన్స్ డ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మ్యాథమేటిక్స్ స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్  నిర్వహించిన న్యూ పారాడమ్స్ ఇని ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ సెమినార్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సైబర్ నేరాల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి ప్రస్తుతం సాంకేతిక అభివృద్ధి ప్రపంచంలో సైబర్ సెక్యూరిటీ కీలకంగా మారిందని అభిప్రాయపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం ఉపయోగంలో ఉన్న వాటిలో 8.4 బిలియన్ల్ పరికరాలు అనుసంధానం అయ్యి ఉన్నాయని, ఈ పరిస్థితుల్లో సంప్రదాయ భద్రతా వ్యవస్థలు సరిపోవని సాంకేతిక పరిజ్ఞానాన్ని నిరంతరం నవీనీకరించడం, సాఫ్ట్ వేర్ ను మెరుగు పరచడం మరియు ప్రపంచ వ్యాప్తంగా ఎదురయ్యే అనేక సవాళ్ళను ఎదుర్కొనే దిశగా కంప్యూటింగ్ స్థాయిని మెరుగు పరచడం లాంటి వాటి మీద దృష్టి పెట్టాలని తెలిపారు.


సమాచార భద్రతకోసం విస్తృతమైన ఆలోచనలు రావాలి

21వ శతాబ్ధంలో సాంకేతిక పరిజ్ఞానంలో చోటు చేసుకున్న మార్పులు, మానవ జీవితంలో అనేక రకాల మార్పులకు కారణం అయ్యాయన్న ఉపరాష్ట్రపతి, కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్) మరియు మెషిన్ లెర్నింగ్ లాంటి సమర్థవంతమైన అనువర్తనాలను ఈ సాంకేతికతలో కీలకమైనవి పేర్కొన్నారు. ప్రస్తుత కాలానికి సంబంధించిన అనేక క్లిష్టమైన సమస్యలను సాంకేతిక పరిజ్ఞానం అత్యంత సులభంగా పరిష్కరిస్తోందని తెలిపారు. పెద్దసంస్థల్లో కృత్రిమ పరిజ్ఞానం మరియు మెషిన్ లెర్నింగ్ వినియోగాన్ని ప్రస్తావించిన ఆయన, ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని చిన్న మరియు మధ్యతరహా సంస్థల్లో, చిన్న స్థాయి వ్యాపారాల్లో, కాలానుగుణమైన వ్యాపారాల్లో విరివిగా వినియోగించడం ద్వారా వ్యాపార ప్రక్రియను మరింత మెరుగు పరచవచ్చని తెలిపారు. కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీలో భారతదేశం ప్రపంచానికి మార్గనిర్దేశనం చేయాలని ఆకాంక్షించిన ఉపరాష్ట్రపతి ఇందు కోసం పరిశోధన మరియు అభివృద్ధిలో పెట్టుబడులు పెరగాలని తెలిపారు. భారతదేశం ఎగుమతులను పెంచాలని, త్వరలోనే ఈ విషయంలో భారతదేశం మరింత కీలకంగా ఎదుగుతుందని తెలిపారు. 2022-23 నాటినికి బారత ఆర్థిక వృద్ధి రేటు దాదాపు 4 లక్షల కోట్ల డాలర్లకు పెరిగే అవకాశం ఉందన్న ఉపరాష్ట్రపతి, ప్రజ జీవితాల్లో సాంకేతిక ఆవిష్కరణలు ప్రత్యక్షమైన, సానుకూల ప్రభావాన్ని కల్పించాలని, ఇందుకోసం మరిన్ని ఆవిష్కరణలు అవసరమని తెలిపారు. ఈ అభివృద్ధి సార్థకం కావాలంటే పేదరికం, ఆకలి, నిరక్షరాస్యత మరియు అనారోగ్యాలు వంటి కీలక అభివృద్ధి సవాళ్ళను పరిష్కరించాల్సిన అవసరం ఉందని తెలిపారు.భారతదేశంలో సుమరారు 600 మిలియన్ల బారతీయులు 25 సంవత్సరాల కంటే తక్కువ వయసు గల యువకులని తెలిపిన ఉపరాష్ట్రపతి, జనాభా డివిడెండ్ మరియు వారి ఉత్సాహం, వేగవంతమైన ఆలోచనలతో భారత అభివృద్ధి ముఖ చిత్రాన్ని మార్చేందుకు కృషి చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్ పాలకమండలి సభ్యులు, సిఆర్ రావ్ ఇనిస్టిట్యూట్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ డా. వి.కె.సరస్వత్,  హైదరాబాద్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొ. అప్పారావు పొదిలె, 
సి.ఆర్.రావు ఇనిస్టిట్యూట్ డైరక్టర్ ప్రొ.డి.ఎన్.రెడ్డి, ఏ.ఆర్.సి.సి. ప్రాజెక్ట్ డైరక్టర్ ఎ. ఆనంద్, శాస్త్రవేత్తలు, అధ్యాపకులు మరియు పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.

No comments:
Write comments