జార్ఖండ్ లో రోడ్డు ప్రమాదం…పదకొండు మంది మృతి

 


రాంచీ జూన్ 10, (globelmedianews.com)
జార్ఖండ్ రాష్ట్రం హజరీబాగ్ జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పదకోండు మంది మృతి చెందారు. జాతీయ రహదారిపై ఆగి వున్న  లారీని బస్సు ఢీకొట్టిన ప్రమాదంలో బస్సు డ్రైవర్ మహ్మద్ కుడా మరణించాడు. ఘటనలో 26 మంది గాయపడ్డారు. వీరిలో చాలామంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.  బాధితులంతా బీహార్ వాసులు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. తెల్లవారు జామున ధనువా భనువా ఘాట్ రోడ్డులో  ఈ ప్రమాదం జరిగింది. 


జార్ఖండ్ లో రోడ్డు ప్రమాదం…పదకొండు మంది మృతి
ఇనుప చువ్వలతో వెళ్తున్న ఓ లారీ మరమ్మతులకు గురై ఆగిపోయింది. అదే సమయంలో వెనుక నుంచి పర్యాటకులతో వస్తున్న ఓ బస్సు బ్రేకులు పెయిల్ కావడంతో లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇనుప చువ్వలు బస్సులో నుంచి దూసుకువచ్చి ప్రయాణికుల ప్రాణాలు తీశాయి. బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు కాగా మృతులు, క్షతగాత్రులు చాలామంది బస్సులోనే చిక్కుకుపోయారు. మృతుల్లో ఒక బాలుడు కుడా వున్నాడు. బస్సు రాంచీ నుంచి పాట్న లోని మసౌరీ కి వెళుతోంది. బస్సును అతివేగంగా నడిపిస్తుండడం వల్ల డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోయాడని, అదే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.

No comments:
Write comments