బాధ్యతలు స్వీకరించిన సజ్జల

 


అమరావతి, జూన్ 27, (globelmedianews.com)
రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యవహారాలు  సలహాదారు గా సజ్జల రామకృష్ణ రెడ్డి గురువారం రెండవ బ్లాక్ లోని ఆయన ఛాంబర్ లో బాధ్యత లు స్వీకరించారు.  ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాకు కల్పించిన బాధ్యతను నిర్వరించేందుకు నా శక్తీ మేరకు కృషి చేస్తానని తెలిపారు. 


బాధ్యతలు స్వీకరించిన సజ్జల
దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆలోచనల మేరకు , జగన్ మోహన్ రెడ్డి పాద యాత్ర లో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశలో నా వంతు సహకారం అందించండం జరుగుతుంది. గత ఐదు సంవత్సరాలు లో రాష్ట్రం కోల్పోయిన వాటిని కూడగట్టుకొని, రాష్ట్రానికి బంగారు భవిష్యత్తు తీసుకుని రావడానికి నా వంతు చిన్న చేయూత ను అందించడానికి సిద్ధంగా ఉన్నానని అయన అన్నారు.

No comments:
Write comments