ఆర్టీసీ బస్సులకు వాన గండం

 


సికింద్రాబాద్, జూన్ 27, (globelmedianews.com)
వర్షాకాలం ఆర్టీసికి కూడా కలవరం కలిగించే కాలం. ఏమాత్రం భారీ వర్షం పడినా జలాశయాలను తలపించే రహదారుల్లో బస్సు ఆగిపోతే ప్రయాణికుల అవస్తలు ఇన్నీ అన్నీ కావు. సాధారణ రోజుల్లోనే మోరాయించి నడిరోడ్డుపై నిలిచిపోయే పాత బస్సులు ఇప్పుడు మరింత పరీక్ష పెట్టే ఆస్కారం ఉంది. కూడళ్ళ వద్ద ఆగిపోతే వెనుక వచ్చే వావాహనాలపై ఆ ప్రభావం వుంటుంది. అయితే బస్సులను పూర్తి సామర్థంతో ఉంచుతామన్నది అధికారుల మాట. నడుస్తున్న వాటిలో అత్యధికం పది సంవత్సరాలు దాటినవే కావడంతో ఈ కాలంలో ఇవి ఎక్కడ ఆగిపోతాయోననే భయం ప్రయాణికుల్లో నెలకొంది.టిఎస్‌ఆర్టీసీ గ్రేటర్ జోన్‌లో 3850 బస్సులు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మెట్రో లగ్జరీ పేరిట 80 వోల్వో ఏసీ బస్సులను కొన్నారు. ఇవి మినహయిస్తే ఒక్కటి కూడా కొత్తవి కొనలేదు. అంటే నాలుగు ఏళ్ళ క్రితం ఉన్నవే ఉన్నవి. ఇటువంటి దశలో 500 బస్సులు 15 సంవత్సరాలు దాటిపోతే వాటిని తొలగించారు. ఈ స్థానంలో అద్దె బస్సులను కొత్తవి తీసుకున్నారు. 

ఆర్టీసీ బస్సులకు వాన గండం

జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పథకం కింద సమకూరిన బస్సులో సగం పూర్తిగా తుక్కుగా మారాయి. కొన్ని ఇంజన్ బాగుంటే, బాడీ పూర్తిగా దెబ్బతింది. ఇవి గత మూడు సంవత్సరాలుగా నగరంలో పలు ప్రాంతాల్లో ఆగిపోతున్నాయి. దీంతో మోబైల్ మరమ్మత్తు వాహనాలను తీసుకు వచ్చి బాగు చేసి వాటిని నడిపించేందుకు శత విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. అప్పటికి మొరాయించడంతో వాటని పూర్థి స్థాయిలో మరమ్మత్తులు నిర్వహించేందుకు ప్రయత్నం చేశారు.ఇక 10 నుంచి 12 సంవత్సల లోపు ఉన్న బస్సులు నగరంలో 1300 ఉన్నాయి. మరో 150 వరకు 15 సంవత్సరాలకు దగ్గరగా ఉన్నాయి. మొత్తం మీద ప్రస్తుతం నగరంలో నడిచ బస్సులో సగం సామర్దం లేనివే..నగర రహదారులపై బస్సులు 10 సంవత్సరాలు తిరగడం అంటే సాధరణమైన విషయం కాదు. చీమల్లా కదిలే వాహనా మద్య,గతుకులు రోడ్లపై ఇవే ఆరు, ఏడు సంవత్సరాలకే వర్క్‌షాప్‌కు వెళతాయి. బ్రేకులు పడవు, గేర్లు మారవు, లైట్ల వెలగవు బస్సులతో వర్షాకాలంలో ఇబ్బందులు తప్పవు, వర్కుషాపుల్లో వీటి నిర్వాహణకు నిధుల కొరత ఉండటంతో ఉన్న బసుల్లో బాగాలను అటు ఇటు మార్చి సర్దుబాట్లు చేయలేక మెకానిక్‌లు ఇనేక ఇబ్బందులు పడుతున్నారు. విశ్రాంతిలో ఉంచిన బస్సుల భాగాలతో నెట్టుకు రావడం కత్తి మీద సాములా మారింది. ఇక వర్షం పడితే అద్దాలపై పడే నీటిని తుడిచే వైఫర్లు పని చేయక పోవడం,లైట్లు వెలగక పోవడం ఈ విధంగా ప్రతి బస్సులోనే ఏవో సాంకేతిక సమస్యలు వర్షాకాలంలో చిక్కులు తెచ్చిపెడుతన్నాయి. మూడు సంవత్సరాలుగా కొత్తవి కొనక పోవడంతో ఉన్నవాటికే మరమ్మత్తులు చేసి నడిపించడం ఇబ్బంది కరంగా మారింది.దీంతో ఆర్టీసీ ఆర్ధిక ఇబ్బందులు తప్పడ ం లేదు. సంస్ద వద్ద ఉన్న వాహనాలు పాత పడిపోవడంతో వాటిని అలానే సాగిస్తున్నారు. ఇటీవల రోడ్ల మీద ఆగిపోతుండటంతో 550 బస్సులకు వరకు అద్దెకు తీసుకుని నడిపిస్తున్నారు. వీటితో పాటు 80 బస్సులను మోట్రో లగ్జరీ ఉండటంతో వీటి సంఖ్య 620కి చేరింది.గుడ్డిలో మెల్ల అన్న చందంగా కొత్త బస్సులు నగర రోడ్ల మీద కనపడుతన్నాయి.జెన్‌ఎన్‌యుఆర్‌ఎం పథకం కింద తీసుకున్న బస్సులో పూర్తి మర్మత్తులు చేసి మరో 30 బస్సుల వరకు రోడ్ల మీదకు ఎక్కించారు. ఏది ఏమైప్పటికి అధికారులు సామర్దం లేని బస్సులను గుర్తించి వాటిని తొలగించడం కాని, లేదా వాటిని పూర్తి స్థాయిలో మరమ్మత్తులు చేయడం ద్వారా ఈ సమస్యలను తగ్గించ వచ్చు.

No comments:
Write comments