కలకలం రేపుతున్న ఆత్మీయ శత్రువులు

 


గుంటూరు, జూన్ 6 (globelmedianews.com)
తాజాగా ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో అనేక సంచ‌ల‌నాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా బంధువ‌ర్గాల‌కు బంధువ‌ర్గాలే ఓట‌మిపాల‌య్యాయి. ఈ ప‌రిస్థితి ఆయా కుటుంబాల‌ను తీవ్ర‌స్థాయిలో కుమిలిపోయేలా చేస్తున్నాయి. సీమ‌లో అయితే కేఈ ఫ్యామిలీ, కోట్ల ఫ్యామిలీ లాంటి దిగ్గ‌జ రాజ‌కీయ ఫ్యామిలీలే ఓడిపోయాయి. విష‌యంలోకి వెళ్తే.. గుంటూరు జిల్లాకు చెందిన వియ్యంకులు జీవీ ఆంజ‌నేయులు కొమ్మాల‌పాటి శ్రీధ‌ర్‌ టీడీపీలో కీల‌క స్థానంలో ఉన్నారు. జీవీ ఏకంగా గుంటూరు జిల్లా టీడీపీ అధ్య‌క్షుడిగా కూడా ప‌నిచేస్తున్నారు. 2009 ఎన్నిక‌ల్లో వైఎస్ హ‌వా భారీ ఎత్తున ఉన్నప్పటికీ జీవీ విజ‌యం సాధించారు. గుంటూరు జిల్లా వినుకొండ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న విజ‌యం సాధించారు. త‌న ప‌నితీరుతో ప్ర‌జ‌ల‌ను మెప్పించిన ఆయ‌న 2014లోనూ వ‌రుస విజ‌యాలు కైవ‌సం చేసుకున్నారు.ఈ రెండు ఎన్నిక‌ల్లోనూ జీవీ 24 వేలు, 22 వేల ఓట్ల భారీ మెజార్టీల‌తో ఘ‌న‌విజ‌యాలు సాధించారు. ఈ ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న గెలుపు న‌ల్లేరుమీద న‌డ‌కే అన్న చ‌ర్చ‌లు న‌డిచాయి. అయితే ఈ సారి మాత్రం సీన్ రివ‌ర్స్ అయ్యింది. ఈ ఎన్నిక‌ల్లో మాత్రం జీవీ ఓట‌మి పాల‌య్యారు. ఇక్క‌డ నుంచి పోటీ చేసిన వైసీపీ అభ్య‌ర్థి బొల్లా బ్ర‌హ్మ నాయుడిపై జీవీ ప‌రాజ‌యం పాల‌య్యారు. ఇక‌, ఈయ‌న వియ్యంకుడు, టీడీపీ నాయ‌కుడు కొమ్మాల‌పాటి శ్రీధ‌ర్ కూడా వైఎస్ హ‌వాను త‌ట్టుకుని 2009లో పెద‌కూర‌పాడు నుంచివిజ‌యం సాధించారు. 


కలకలం రేపుతున్న ఆత్మీయ శత్రువులు

త‌ర్వాత జ‌రిగిన ఎన్నిక‌ల్లోనూ వ‌రుస‌గా ఈ నియోజ‌క‌వ‌ర్గంలో పాగా వేశారు. అయితే, తాజా ఎన్నిక‌ల్లో డాక్ట‌ర్ నంబూరు శంక‌ర్రావుపై ఆయ‌న ఓడిపోయారు. దీంతో ఇరు శిబిరాల్లోనూ ఒకింత ఆందోళ‌న‌, ఆవేద‌న చోటు చేసుకుంది. జీవీకి ప్ర‌జాభిమానం మెండుగా ఉంది. వ్య‌క్తిగ‌తంగా ఆయ‌న‌కు శ‌త్రువులు కూడా లేరు. అయితే, బొల్లా వ‌రుస ఓట‌ముల‌తో ఆయ‌న‌పై ప్ర‌జ‌లు సానుభూతి ప‌వ‌నాలు కురిపించార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.2009లో ప్ర‌జారాజ్యం నుంచి వినుకొండ‌లో పోటీ చేసి ఓడిపోయిన ఆయ‌న గ‌త ఎన్నిక‌లకు ముందు వినుకొండ‌లో వ‌ర్క్ చేసుకున్నారు. అయితే జ‌గ‌న్ చివ‌ర్లో బ్ర‌హ్మ‌నాయుడిని పెద‌కూర‌పాడుకు పంపారు. వినుకొండ‌లో న‌న్న‌పునేని సుధ‌ను రంగంలోకి దించారు. ఈ ఎన్నిక‌ల్లో ఇద్ద‌రు వియ్యంకులు సుధ‌, బ్ర‌హ్మ‌నాయుడిపై విజ‌యం సాధించారు. గ‌త ఎన్నిక‌ల్లో నియోజ‌క‌వ‌ర్గం మార‌డం.. వ‌రుస ఓట‌ములు, జ‌గ‌న్ వేవ్‌తో పాటు సౌమ్యుడు అన్న పేరు క‌లిసి వ‌చ్చి ఈ సారి వినుకొండ‌లో జీవీపై బొల్లా బ్ర‌హ్మానాయుడు విజ‌యం సాధించారు.ఇక‌, కొమ్మాల‌పాటి విష‌యానికి వ‌స్తే.. ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా కొన్ని శ‌క్తులు ఇక్క‌డ ప‌నిచేశాయి. ఆయ‌న ఎవ‌రి మాటా విన‌డం లేద‌ని, ఆయ‌న చెప్పిన ప్ర‌కార‌మే న‌డుచుకోవాల‌నే ఓ నియంతృత్వ పోక‌డ‌లు వ‌చ్చాయ‌ని ఇక్క‌డ పెద్ద ఎత్తున ప్ర‌చారం కావ‌డం ఆయ‌న‌కు బెడిసి కొట్టింది. అదే స‌మ‌యంలో నంబూరి కూడా భారీ ఎత్తున నిధులు కుమ్మ‌రించి పెద్ద ఎత్తున ప్రచారం చేయ‌డం ఇక్క‌డ కొమ్మాల‌పాటికి మైన‌స్‌గామారిపోయింది. ఎన్నిక‌ల‌కు ఆరు నెల‌ల ముందు వ‌ర‌కు కూర‌పాడులో శ్రీధ‌ర్‌కు తిరుగులేద‌న్న అభిప్రాయాలే వ్య‌క్త‌మ‌య్యాయి. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న గెలుపు కోసం ప‌నిచేసిన వారినే ప‌క్క‌న పెట్టిన ఆయ‌న సొంత సామాజిక‌వ‌ర్గంలోనే తీవ్ర వ్య‌తిరేక‌త కొని తెచ్చుకున్నారు.సొంత సామాజిక‌వ‌ర్గ‌మైన క‌మ్మ సామాజిక వ‌ర్గంలోనే చాలా మంది శంక‌ర‌రావును ప‌ట్టుబ‌ట్టి పెద‌కూర‌పాడుకు తీసుకువ‌చ్చారు. ఆయ‌న‌ది తుళ్లూరు మండ‌లం (తాడికొండ నియోజ‌క‌వ‌ర్గం)లోని పెద‌ప‌రిమి స్వ‌గ్రామం. కేవ‌లం శ్రీధ‌ర్‌ను ఎలాగైనా ఓడించాల‌న్న ప‌ట్టుద‌ల‌తోనే ఆయ‌న్ను ఇక్క‌డ‌కు ఆహ్వానించారు. శంక‌ర‌రావు సామాజిక‌, ఆర్థిక కోణాల్లో బ‌ల‌మైన వ్య‌క్తి కావ‌డం, శ్రీధ‌ర్‌పై ఉన్న వ్య‌తిరేక‌త‌, జ‌గ‌న్ వేవ్‌తో ఇక్క‌డ శ్రీధ‌ర్ మూడో ప్ర‌య‌త్నంలో ఓడిపోయారు. దీంతో ఇద్ద‌రు వియ్యంకులు కూడా ఓట‌మి పాల‌య్యారు. దీంతో ఇప్పుడు వీరి భ‌విష్య‌త్తు ఏంట‌నే చ‌ర్చ జోరుగా జ‌రుగుతోంది. ఇప్పుడు ఓడిపోయినా జీవీ ప్ర‌జ‌ల‌కు చేసిన సేవ‌ల నేప‌థ్యం, త‌న సొంత చారిటీ సంస్థ ద్వారా చేస్తున్న సాయం వంటివి ఆయ‌నకు ఎప్ప‌ట‌కీ ప్ల‌స్‌లే. జీవీపై వ్య‌తిరేక‌త లేకుండా ఓడిపోయార‌నే చెప్పాలి. కానీ, కొమ్మాల‌పాటి విష‌యానికి వ‌స్తే.. మాత్రం ఇది రివ‌ర్స్ అవుతుంద‌ని చెబుతున్నారు.

No comments:
Write comments