జగన్ మరీ ముందుచూపు...

 


గుంటూరు, జూన్ 3, (globelmedianews.com)
జగన్ ఒకరకంగా అదృష్టవంతుడనే చెప్పుకోవాలి. కొత్త రాష్ట్రం ఏర్పడిన ఐదేళ్లకు ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించడమే కాకుండా అతి చిన్న వయసులోనే ఆయన ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. ఇప్పుడు జగన్ ముందు రెండు సమస్యలున్నాయి. ఒకటి ఆర్థిక నష్టాలను పూడ్చుకుంటూ ప్రభుత్వాన్ని సరైన దిశాగా నడిపిస్తూ పాలనను గాడిలో పెట్టడం. రెండోది పార్టీపైన కూడా ఒక కన్నేసి ఉండటం. చంద్రబాబునాయుడు ఘోర పరాజయానికి కారణం పార్టీని గత ఐదేళ్ల నుంచి పట్టించుకోకపోవడమే. స్థానిక నేతలపై ఆయన పార్టీని వదిలేశారు. దీంతో ఎన్నికల సమయానికి వచ్చేసరికి పార్టీని గాడిలో పెట్టాలనుకున్న చంద్రబాబుకు అది సాధ్యం కాలేదు.టిక్కెట్ల పంపిణీ నుంచి నియోజకవర్గాల్లో అసమ్మతి పెరిగిపోయింది. జగన్ ను అదృష్టవంతుడు అని ఎందుకనాల్సి వస్తుందంటే… ఏపీలో వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల సంఖ్య ఖచ్చితంగా పెరుగుతుంది. ప్రస్తుతం ఉన్న 175 నియోజకవర్గాల స్థానంలో 225 కు చేరుకుంటాయి. 


జగన్  మరీ ముందుచూపు...
ఒకవైపు పాలన చూస్తూనే పార్టీపై కూడా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. జగన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశంలోనే మిషన్ 2024 ను టార్గెట్ గా ప్రకటించారు. దీంతో 225 నియోజకవర్గాలకు సమర్థవంతులైన నాయకత్వాన్ని జగన్ ఇప్పటి నుంచే తయారు చేసుకోవాల్సి ఉంటుంది.ఈ విషయంలో చంద్రబాబు నాయుడు అన్ లక్కీ అనే చెప్పుకోవాలి. నియోజకవర్గాల పునర్విభజన జరిగి ఉంటే పార్టీలో అసమ్మతి ఇంతగా బయటకు వచ్చేదికాదు. అయితే ప్రజలు ఏకపక్షంగా తీర్పు ఇవ్వడంతో నియోజకవర్గాలు పెరిగినా గెలుపు జగన్ పరం అయి ఉండేదన్న వాదన కూడా లేకపోలేదు. అయితే ఐదేళ్ల నుంచి జగన్ కు గ్రౌండ్ వర్క్ చేసుకోవడానికి చాలా సమయం చిక్కింది. కేంద్రంలో తిరిగి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడటంతో వచ్చే ఎన్నికల నాటికి ఖచ్చితంగా నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది.ఆలోచనతోనే జగన్ గ్రామస్థాయిలో పార్టీ పటిష్టత కోసమే వాలంటీర్లను నియమిస్తున్నారంటున్నారు. ఈ వాలంటీర్లే రేపు ఎన్నికల నాటికి ఫీడ్ బ్యాక్ కు పనికొస్తారని జగన్ భావిస్తున్నారు. పార్టీ నేతల పరిస్థితిపై కూడా వీరిద్వారానే తెలుసుకునే వీలుంటుంది. ఇతర పార్టీల నుంచి బలమైన నేతలను ఇప్పటి నుంచే తీసుకుని ఆ ప్రాంతాలపై పట్టు సాధించేందుకు జగన్ కు వీలవుతుందంటున్నారు. ఇలా జగన్ వచ్చే ఎన్నికలకు ఇప్పటినుంచే ప్రణాళికను సిద్దం చేస్తున్నారు. అయితే పాలన గాడిలో పెట్టడానికే ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది. మరి జగన్ పార్టీ బాధ్యతలను ఎవరికైనా అప్పగిస్తారా? లేకుంటే తానే కొంత సమయం కేటాయిస్తారా? అన్నది చూడాల్సి ఉంది.

No comments:
Write comments