ప్రతిపక్షాలు ప్రాజెక్ట్‌లను అడ్డుకోవడం మానుకోవాలి : పల్లా

 


ఖమ్మం జూన్18 (globelmedianews.com
కాళేశ్వర ప్రాజెక్ట్‌ నిర్మాణం ఓ చరిత్రాత్మక ఘట్టమని టీఆర్‌ఎస్‌ నాయకుడు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి ప్రశంసించారు. మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ప్రపంచంలోనే అత్యంత పెద్దదన్నారు. అతి తక్కువ సమయంలో ఇంత పెద్ద ప్రాజెక్టును పూర్తి చేయ్యటం తెలంగాణ ప్రభుత్వ పాలనకు నిదర్శనం అన్నారు. 


ప్రతిపక్షాలు ప్రాజెక్ట్‌లను అడ్డుకోవడం మానుకోవాలి : పల్లా
ప్రతిపక్షాలు అడుగడుగునా అడ్డుపడుతున్నా.. చిత్తశుద్ధితో అన్ని ఒడిదుడుకులను ఎదుర్కొని ప్రాజెక్ట్‌ను పూర్తి చేసిన ఘనత కేసీఆర్‌దే అని ప్రశంసించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ మాదిరిగానే సీతారామ ప్రాజెక్ట్‌ను కూడా పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.సమావేశం లో పాల్గొన్న ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌ మాట్లాడుతూ పొరుగు రాష్ట్రాలతో సఖ్యతగా ఉంటూ ప్రాజెక్ట్‌ల నిర్మాణం చేపట్టడం తెలంగాణ ప్రభుత్వ పాలనకు నిదర్శనమన్నారు కాళేశ్వరం మాదిరిగానే సీతారామ ప్రాజెక్ట్‌ను కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ నాయకులు ఇప్పటికైనా తమ వైఖరి మార్చుకోవాలని.. ప్రాజెక్ట్‌లను అడ్డుకునే పద్దతిని విడనాడలని తెలిపారు.

No comments:
Write comments