చత్తీస్‌గఢ్ లో ఎదురు కాల్పులు...ఇద్దరు నక్సల్స్ హతం..

 


ములుగు జూన్14 (globelmedianews.com
చత్తీస్‌గఢ్ ఏజెన్సీలో తుపాకుల మోత మోగింది. నక్సల్స్, భద్రతబలగాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతమైనట్లు తెలుస్తోంది. వివరాలు.. చత్తీస్‌గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో డీఆర్జీ భద్రత బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో తాడోకి పోలీస్ స్టేషన్ పరిధిలోని మూర్నార్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు తారాస పడి కాల్పులకు దిగారు. దీంతో వెంటనే ‍అప్రమత్తమైన జవాన్లు ఎదురుకాల్పులు ప్రారంభించారు. ఇరువర్గాల మధ్య సుమారు 40నిమిషాల పాటు కాల్పులు జరుగాయి.


 చత్తీస్‌గఢ్ లో ఎదురు కాల్పులు...ఇద్దరు నక్సల్స్ హతం..
కాసేపటికి జవాన్ల ధాటికి తాళలేక మావోయిస్టు అక్కడి నుంచి తప్పించుకున్నారు. కాల్పుల విరమణ అనంతరం భధ్రత బలగాలు సంఘటన స్థలంలో ఎదురు కాల్పుల్లో మృతి చెందిన ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలతో పాటు ఒక 303రైఫిల్, ఒక 301 బోర్ తుపాకి, మరో రెండు ఆయుధాలతో పాటు మావోయిస్టులకు సంబంధించిన ఇతర సామాగ్రిని స్వాధీనపరుచుకున్నారు. ఈ ఘనపై కాంకేర్ ఎస్పీ కే.ఎల్. ధృవ్ స్పష్టత ఇచ్చారు. గురువారం తెల్లవా జామున ఈ ఘటన చోటు చేసుకుంది.

No comments:
Write comments