కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండానే కాళేశ్వరం నిర్మాణం: మంత్రి శ్రీనివాసగౌడ్‌

 


హైదరాబాద్ జూన్ 20   (globelmedianews.com)
:తెలంగాణ మంత్రి శ్రీనివాసగౌడ్‌ బీజేపీ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాళేశ్వరం చూసి ఓర్వలేకే బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారని అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ పట్ల బాధ్యత లేనట్లు బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండానే కాళేశ్వరం నిర్మాణం: మంత్రి శ్రీనివాసగౌడ్
కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండానే కాళేశ్వరాన్ని నిర్మించామని అన్నారు. రాష్ట్రాలకు సహజంగా ఇచ్చే అనుమతులే కాళేశ్వరానికి కేంద్రం ఇచ్చిందన్నారు. నాలుగు ఎంపీ సీట్లు గెలవగానే బీజేపీ నేతలు ఎగసిపడుతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ బలం ఏంటో పరిషత్‌ ఎన్నికలతో రుజువైందని మంత్రి శ్రీనివాసగౌడ్‌ అన్నారు.

No comments:
Write comments