కిట్లు ఏవీ..? (నిజామాబాద్)

 

నిజామాబాద్, జూన్ 4 (globelmedianews.com): 
కేసీఆర్‌ కిట్లు అందుబాటులోకి రావడంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఈ పథకానికి వచ్చిన స్పందన చూసి మరింత మెరుగులు దిద్దాల్సింది పోయి రూ.లక్షల్లో బకాయిలు ఉంచి, లబ్ధిదారులను కార్యాలయాల చుట్టూ తిప్పించుకొంటున్నారు.ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన బాలింతకు కేసీఆర్‌ కిట్‌ ఇవ్వడంతో పాటు మగ పిల్లవాడు పుడితే రూ.12 వేలు, ఆడపిల్ల పుడితే రూ.13 వేల సాయాన్ని ప్రభుత్వం అందజేస్తోంది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ గత నవంబరు నుంచి అంటే 7 నెలలుగా నయాపైసా రాకపోవడంతో సుమారు 26 వేల మంది లబ్ధిదారులు పిల్లలను ఎత్తుకొని బ్యాంకులు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాలు, ప్రభుత్వ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. 

కిట్లు ఏవీ..? (నిజామాబాద్)
ఇదిగో వస్తాయి.. అదిగో వస్తాయంటూ తిప్పుతున్నారే తప్ప నేటికీ నయాపైసా ఇవ్వడం లేదు. ఉభయ జిల్లాల్లో 26 వేల మందికి రూ.13.3 కోట్లు చెల్లించాల్సి ఉంది. జిల్లా అధికారులు, సిబ్బంది ఈ విషయాన్ని బయటకు పొక్కనీయకుండా జాగ్రత్త పడుతున్నారు.బకాయిలకుతోడు మధ్యమధ్యలో కేసీఆర్‌ కిట్లకు సైతం కొరత ఏర్పడుతోంది. గత ఫిబ్రవరి, మార్చిలో బాలింతలు ప్రసవం అనంతరం ఖాళీ చేతులతోనే ఇంటికి వెళ్లారు. కిట్ల కొరత ఉన్న సమయంలో కొందరు దళారులు రూ.1,200 ఇస్తే త్వరగా కిట్‌ ఇప్పిస్తానని చెప్పి వసూలు చేసిన సందర్భాలున్నాయి. గర్భిణులకు మొదటి దశలో 5వ నెలలో రూ.3 వేలు, రెండో దశలో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించిన సమయంలో మగబిడ్డ పుడితే రూ.4 వేలు, ఆడబిడ్డ పుడితే రూ.5 వేలు చెల్లిస్తారు. ఇక మూడో దశలో రూ.2 వేలు, చివరగా టీకాలు అన్నీ వేయించడం పూర్తికాగానే రూ.3 వేల సాయాన్ని ప్రభుత్వం అందజేస్తుంది. కానీ ప్రస్తుతం మొదటి దశ నుంచి చివరి దశ వరకు నయాపైసా రానివారు ఉన్నారు.

No comments:
Write comments