భారీగా పెరిగిన ఎరువుల ధరలు

 


వరంగల్, జూన్ 3, (globelmedianews.com)
రెండేళ్లుగా ఎరువుల ధరల్లో భారీ పెరుగుదల ఉంది. యూరియాను మినహాయించి డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు ఒక్కో సంచిపై వంద రూపాయలకు పైగా పెరగడంతో అయిదారు ఎకరాలు సాగు చేసే రైతులపై అదనంగా మూడు నాలుగు వేల రూపాయల భారం పడుతోంది. ప్రభుత్వం పెట్టుబడి సాయమందించడం రైతులకు కొంత ఊరటనిచ్చిన ఎరువులు, పురుగుమందుల ధరల పెంపు వల్ల సాగులో పెట్టుబడి పెరిగిపోయే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోందిఎరువులతో పాటు ఇతర మందుల ధరలు పెరగడంతో పంట సాగులో పెట్టుబడి బాగా పెరిగిపోయింది. తాజాగా రైతులు ఎక్కువగా వినియోగించే డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు పెంచడం రైతులకు మరింత భారంగా మారింది.ఉమ్మడి జిల్లాలో ఏటా 15 లక్షల ఎకరాల్లో పంటలు సాగు అవుతాయి. ఇందుకు 3.72లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరం అవుతాయి. 


భారీగా పెరిగిన ఎరువుల ధరలు
ఇందులో ఎక్కువగా యూరియా 1.50లక్షల మెట్రిక్‌ టన్నులు కాగా, డీఏపీ 98 వేల మెట్రిక్‌ టన్నులు వినియోగిస్తారు.. డీఏపీ బస్తాకు రూ.169 పెరిగింది.. కాంప్లెక్స్‌ ఎరువుల వినియోగం 80వేల మెట్రిక్‌ టన్నులు ఉంటుంది. వీటి ధర సంచికి వంద రూపాయలకు పైగా పెరిగింది. గతంతో పోలిస్తే డీఏపీ ధర ఎక్కువగా పెరగడంతో రైతులు డీఏపీ వాడకం తగ్గించి తక్కువ ధర ఉన్న యూరియా ఇతర ఎరువుల వినియోగాన్ని పెంచారు. దీంతో పంట సాగులో ఎరువుల సమతుల్యత దెబ్బతినే వీలుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. వినియోగం తగ్గించేందుకు యూరియా సంచి 50 కిలోల నుంచి 45 కిలోలకు తగ్గించారు. కొనుగోలు చేసిన రైతు ఎకరానికి ఒక సంచి లెక్కన పొలానికి తీసుకెళుతుండటంతో సంచిలోనే అయిదు కిలోలు తగ్గించడం వల్ల రైతులు యూరియా వాడకం తగ్గిస్తారని అధికారులు అంటున్నారు. ఇందులో భాగంగానే సంచి నుంచి అయిదు కిలోలు తీసేసి ఒక్కో సంచి 45కిలోలకు పరిమితం చేసినట్లు తెలుస్తోంది. అయితే ధర మాత్రం అలాగే రూ.290 ఉంది.. పంట సాగులో ప్రధానమైనది ఎరువులే. అలాంటి ఎరువుల ధరలు ఆకాశాన్నంటితే రైతులు ఇబ్బందులు పడతారు. పైగా ఒక్కో దుకాణంలో ఒక్కో ధర ఉంటోందని రైతులు అంటున్నారు.. ఈ-పాస్‌ విధానం వచ్చిన తరువాత దేశం మొత్తంలో ఎక్కడైనా రైతులు ఎరువులు తీసుకునే అవకాశం ఉంది. దీంతో జిల్లా సరిహద్దులోని మహరాష్ట్రలో కొన్ని ఎరువుల ధరలు ఇక్కడి కంటే తక్కువగా ఉండటంతో మహరాష్ట్ర నుంచి తెచ్చుకుంటున్నారు. ఎరువుల ధరలపై నియంత్రణ లేకుండా ఏటా ధరలు పెంచుకుంటూ పోతే రైతులు పంటలు సాగు చేయలేని పరిస్థితి నెలకొంటుంది.

No comments:
Write comments