మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు కన్నుమూత

 


హైదరాబాద్ జూన్ 12  (globelmedianews.com)
తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా అస్వస్థుడిగా ఉన్న భీముడు నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న తుదిశ్వాస విడిచారు. 1999లో భీముడు గద్వాల నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 


 మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు కన్నుమూత
భీముడు మృతికి గద్వాల ప్రస్తుత టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి సంతాపం ప్రకటించారు. పరిషత్‌ విజయోత్సవాలను నిర్వహించవద్దని పార్టీ నాయకులను కోరారు. భీముడు మృతిపట్ల మంత్రులు శ్రీనివాస్ గౌడ్,  సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణ‌ సంతాపం ప్రకటించారు.

No comments:
Write comments