ముఖ్యమంత్రి చెక్కులను అందజేసిన మంత్రి

 


వనపర్తి జూన్ 12  (globelmedianews.com)
ముఖ్యమంత్రి సహాయనిధి నుండి వచ్చిన చెక్కులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్వయంగా బాధితుల ఇండ్లకు వెళ్లి అందజేశారు. బుధవారం ఆయన జిల్లా తెలంగాణకేంద్రంలోని పాత బజార్. టీచర్స్ కాలనీ. వల్లభ నగర్ ప్రాంతాలను స్వయంగా సందర్శించి బాధితుల ఇండ్ల దగ్గరకు వెళ్లి చెక్కులను అందజేశారు. మొదటగా జిల్లా కేంద్రంలోని టీచర్స్ కాలనీకి చెందిన సువర్ణ కు 30000. 


ముఖ్యమంత్రి చెక్కులను అందజేసిన మంత్రి
పాత బజారు కు చెందిన మొగిలి అమ్మ కు 30000, వల్లభ నగర్ కు చెందిన శ్రీ లత కు 60 వేల రూపాయల చెక్కులను మంత్రి అందజేశారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని. అందులో భాగంగానే ఒక్కొక్క బాధితునికి ఈ విధమైన సహాయం అందిస్తున్నామని ఆయన వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి. గ్రంథాలయ సంస్థ చైర్మన్ లక్ష్మయ్య. మున్సిపల్ చైర్మన్ రమేష్ గౌడ్. కౌన్సిలర్లు గట్టు యాదవ్. వాకిటి శ్రీధర్. నందిమల్ల భువనేశ్వరి. టిఆర్ఎస్ నాయకులు లక్ష్మీనారాయణ. సూర్యవంశం గిరి, నందిమల్ల శ్యామ్ కుమార్. ఉస్మాన్. శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు

No comments:
Write comments