పొంగులేటికి టీటీడీ మెంబర్

 


హైద్రాబాద్, జూన్ 3, (globelmedianews.com)
ఒకటి రెండు రోజులుగా ఒక ఆసక్తికరమైన వార్త తెరమీదకు వచ్చింది. 2014 ఎన్నికల్లో గెలిచిన ఏకైక వైసీపీ ఎంపీ పొంగులేటి గుర్తున్నారు కదా? ఆయనకు జగన్ ఒక పదవి ఇవ్వబోతున్నారట. అదేంటి అతను టీఆర్ఎస్ కదా అనుకుంటున్నారా? అయినా... ఆ రెండు పార్టీలు ఇపుడేం తేడా లేదు కదా. అందుకే టీఆర్ఎస్ లో ఉన్నా పదవి ఇవ్వడానికి అడ్డంకి లేకుండా పోయింది. టీటీడీ కొత్త బోర్డులో పొంగులేటి శ్రీనివాస్ ను ఒక సభ్యుడిగా తీసుకోవాలని జగన్ నిర్ణయించారని చెబుతున్నారు. మొత్తానికి ఇరు పార్టీల మధ్య చాలా అండర్ స్టాండింగ్ ఉంది. అయితే, పొంగులేటి కేసీఆర్ రాజకీయానికి బలై జగన్ కి హ్యాండిచ్చారు. ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు టీఆర్ఎస్ లో చేరారు. అయితే, కేవలం ఏపీపై ఫోకస్ పెట్టిన జగన్ తెలంగాణలో ఏం జరుగుతుందో పట్టించుకోలేదు. 


పొంగులేటికి టీటీడీ మెంబర్
ఇంకా చెప్పాలంటే... ఏం జరిగినా వదిలేశారు. అందుకే ఇక్కడి ఎన్నికల్లో పోటీకి కూడా ట్రై చేయలేదు. అయితే... టీఆర్ఎస్ పొంగులేటికి టికెటివ్వలేదు. అయితే, దీంతో తనకు గతంలో మోసం చేసినా ఒకప్పటి కన్సర్న్ తోనే పొంగులేటికి జగన్ పదవి ఇస్తున్నారు. దీనికి ఒక ప్లాన్ కూడా ఉంది. 2024లో వైసీపీ ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేయబోతోంది. అది టీఆర్ఎస్ తో కలిసా? లేక బీజేపీతో కలిసి పోటీ చేస్తుందా అన్నది భవిష్యత్తు పరిణామాలు నిర్ణయిస్తాయి. అందుకే కొత్త నాయకుడిని తయారుచేసుకోవడం కంటే గతంలో పార్టీలో ఉండి మంచి కేడర్ ఉన్న పొంగులేటినే సిద్ధం చేసుకుంటే బాగుంటుందన్నది జగన్ ఆలోచన.తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్ప‌డ్డాక 2014లో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున తెలంగాణ‌లోని ఖ‌మ్మం స్థానం నుంచి బ‌రిలోకి దిగిన పొంగులేటి అంద‌రి అంచ‌నాల‌ను త‌ల‌కందులు చేస్తూ ఎంపీగా విజ‌యం సాధించారు. అంతేకాకుండా ఖ‌మ్మం జిల్లాల్లో ఓ మూడు అసెంబ్లీ సీట్ల‌లో వైసీపీ గెలుపున‌కు కూడా ఆయ‌న తోడ్ప‌డ్డారు. ఈ నేపథ్యంలో కొత్త పునాదులు వేయడం కంటే పొంగులేటిని లాగేస్తే ఒక జిల్లా సెట్ అయిపోతుందని జగన్ ఆలోచన. ఇలా ప్రతి జిల్లాకు జగన్ ఒక ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు. ఏదేమైనా... పొంగులేటికి పదవివ్వాలనే జగన్ ఆలోచన పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది

No comments:
Write comments