ఇక స్కూళ్లకు గ్యాస్ బండలు..

 


కరీంనగర్, జూన్ 29, (globelmedianews.com)
కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలన్నింటికీ వంటగ్యాస్‌ పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ నిర్ణయించారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం కోసం వంట చెరుకు వాడటం వల్ల విద్యార్థులకు పొగరావటమే కాకుండా వంట చెరుకు కోసం చెట్లను నరకటం విమర్శలకు తావిస్తోంది.జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలకు గత మార్చి నెలలో సిలిండర్లు, పొయ్యిలు సరఫరా చేశారు. జిల్లాలో 1065 అంగన్‌వాడీ కేంద్రాలుండగా 241 సొంత భవనాల్లో, 591 అద్దె భవనాల్లో, 233 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో నడుస్తున్నాయి. అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో వంటగ్యాస్‌ సిలిండర్లు, పొయ్యిలు ఇచ్చేందుకు ప్రభుత్వం గతేడాది రూ. 25 లక్షలు కేటాయించి జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు వాటి గురించి పట్టించుకోలేదు. 

ఇక స్కూళ్లకు గ్యాస్ బండలు..

గత మార్చి 31న నిధులు వృధా పోయే విషయం తెలిసిన జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌ ఒకేరోజులో జిల్లాలోని అన్ని అంగన్‌వాడి కేంద్రాలకు పొయ్యిలు, సిలిండర్లు పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకున్నా పర్యావరణ పరిరక్షణ కోసం హరితహారంలో భాగంగా ఏటా కోట్ల సంఖ్యలో మొక్కలు నాటడం వంట చెరుకు కోసం అడవులు నరకటం ఆనవాయితీగా వస్తోంది.ఇటీవల జరిగిన జిల్లా అభివృద్ధి, పర్యవేక్షణ కమిటి సమావేశంలో చర్చ జరిగింది. జగిత్యాల ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం కోసం కట్టెల పొయ్యి వాడటం వల్ల వంటవారు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అంతేగాకుండా పచ్చని చెట్లను నరికి వంట చెరుకుగా వినియోగిస్తున్నారని దీన్ని దృష్టిలో ఉంచుకొని వంటగ్యాస్‌ సిలిండర్లు ఇవ్వాలని కోరారు. దీనితో ఎంపీ కల్వకుంట్ల కవిత ఏకీభవించారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ స్పందించి అన్ని పాఠశాలల్లో వంటగ్యాస్‌ సిలిండర్లు ఇచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. జిల్లాలోని 796 పాఠశాలల్లో 64,655 మందికి మధ్యాహ్న భోజనం పెడుతుండగా 2,283 మంది వంట పని వారున్నారు. వంట వారికి నెలనెలా రూ.వెయ్యి వేతనం ఇస్తున్నారు. 218 పాఠశాలలకు వంటగదులు మంజూరుకాగా 32 పూర్తయ్యాయి. విద్యార్థుల   సంఖ్యకనుగుణంగా ఒక్కో పాఠశాలకు రెండేసి పొయ్యిలు, రెండు నుంచి నాలుగు సిలిండర్లు పంపిణీ చేయాలని ఆలోచిస్తున్నారు.

No comments:
Write comments